Gas Cylinder: రూ.500లకే గ్యాస్ సిలిండర్ కావాలా.. అయితే ఇలా చేయండి..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.
మరో రెండు గ్యారెంటీలు అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 27 నుంచి ఈ రెండు గ్యారెంటీలు అమల్లోకి రానున్నాయి.

ఇందులో రూ.500 గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. రూ.500 గ్యాస్ పొందే అర్హులను ఇప్పటికే గుర్తించారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా గ్యాస్ సబ్సిడీకి అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 40లక్షల మంది లబ్ధిదారులకు రూ.500 లకే సిలిండర్ అందించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి సివిల్ సప్లయ్స్ అధికారులు మార్గదర్శకాలు గుర్తించారు.

Rs.500 gas cylinder If you want a gas cylinder do this

ప్రజా పాలన దరఖాస్తులు పరిశీలించి ఆధార్, రేషన్ కార్డులతో సరిచేసి చూశారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేని వాటిని పక్కన పడేశారు. లబ్ధిదారులు మూడేండ్లలో ఏడాదికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో కూడా తెలుసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డులున్న (రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు) వారు ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు అర్హులుగా పేర్కొంటున్నారు. ప్రజా పాలనలో తప్పనిసరిగా గ్యాస్‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలనే నిబంధన కూడా తీసుకొచ్చారు.

సిలిండర్‌‌‌‌‌‌‌‌ల కేటాయింపు అనేది.. గడిచిన మూడేండ్లుగా లబ్ధిదారులు సగటున ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారనే ఆధారంగా ఇవ్వనున్నారు. ఆయిల్‌‌‌‌‌‌‌‌ కంపెనీల నగదు బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్) ద్వారా సబ్సిడీ మొత్తం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అంటే మొదటగా పూర్తి డబ్బు పే చేయాలి. తర్వాత లబ్ధిదారుడి ఖాతాలో సబ్సిడీ డబ్బు జమ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+