తెలంగాణలో మైనార్టీలకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణలో మైనార్టీలకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు గుడ్‌న్యూస్ చెప్పారు. పేద మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా దీన్ని అందజేస్తామన్నారు. ఆర్థిక సాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. దీనిపై మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అవుతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
కాగా, పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారిని మంత్రులు హరీశ్‌రావు, మహముద్ అలీ గురువారం సన్మానించారు. జలవిహార్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారు. రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారు. హిందూవులకు కళ్యాణలక్ష్మి అమలు చేసినట్లు.. మైనార్టీల కోసం షాదీ ముబారక్ అమలు చేస్తున్నారని తెలిపారు. మైనార్టీల కోసం రూ. లక్ష ఆర్థిక సాయం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన జీవో ఒకట్రెండు రోజుల్లో వస్తుందని పేర్కొన్నారు.
దేశంలో ఇప్పటికీ ముస్లింలు పేదవారిగానే ఉన్నారు.. ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లేనని హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో రూ. 2,200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు. ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదని గుర్తు చేశారు.
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియం కూడా అందుబాటులో ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నారన్నారు. ఉర్దూ మీడియంలో కూడా నీట్ నిర్వహించాలని అడిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని తెలిపారు. ముస్లింల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మాత్రమే అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications