Viral Video: నిర్లక్ష్యం చేస్తే ఇలానే అవుతుంది.. పాక్ ఆటగాడు ఆఘా సల్మాన్ వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్..

ద్విచక్ర వానహం నడిపే వారికి ఏముండాలి.. లైసెన్స్ ఉండాలి.. ఇంకా.. ఆ.. హెల్మెట్ ఉండాలి. అవును ద్వికచక్ర వానం నడిపేవారికి తప్పుకుండా హెల్మెట్ ఉండాలి. కానీ చాలా మంది హెల్మెట్ ధరించడానికి ఇష్టపడరు. వెంట్రుకలు రాలిపోతున్నాయిని.. చమట వస్తుందని హెల్మెట్ పెట్టుకోరు. కానీ ద్విచక్ర వాహనాలకు జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా తలకు దెబ్బ తగిలి మరణిస్తున్నారు. హెల్మెట్ ప్రాముఖ్యతన ట్రాఫిక్, పోలీసు శాఖ ప్రచారం చేస్తూనే ఉంది. హెల్మెట్ లేకుంటే ఫైన్ కూడా విధిస్తున్నారు.

అయినా చాలా మంది హెల్మెట్ ధరించడం లేదు. తాజా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెల్మెట్ ఆవశ్యకతపై ఓ ఎక్స్(ట్వీట్) చేశారు. ఈ ట్వీట్ లో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఈ వీడియో ఎక్కడిదో కాదు.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు సంబంధించిన వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు. సోమవారం భారత్ పాకిస్థాన్ మధ్య శ్రీలంకలోని కొలంబోలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా బౌలింగ్ లో పాక్ బ్యాటర్ ఆఘా సల్మాన్ గాయపడ్డారు. ఆఘా సల్మాన్ స్వీప్ షాట్ కొట్టబోయాడు కానీ బాల్ పైకి లేచి ముఖానికి తాగింది.

RTC MD Sajjanar posted the video of Pakistani player Agha Salman

ముఖంపై గాయమై రక్తం కూడా కారింది. అయితే ఆ సమయంలో ఆఘా సల్మాన్ హెల్మెట్ పెట్టుకోలేదు. గాయం తర్వాతా అతను హెల్మెట్ పెట్టుకున్నాడు. ముందే హెల్మెట్ ధరించి ఆడితే గాయం కాకపోయేది. దీన్ని ఉదాహరిస్తు సజ్జనార్ ట్వీట్ చేశారు. "ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ రక్షణ కవచం లాంటిది. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ను విధిగా ధరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఇలా ప్రమాదాలకు గురవుతారు.. జాగ్రత్త!" రాసి ఈ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఈ మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. కోహ్లీ, రాహుల్ సెంచరీలతో అజేయంగా నిలిచారు. తర్వాత బ్యాటింగ్ దిగిన పాక్ 128 పరుగలుకే అలౌట్ అయింది. కుల్దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి పాక్ బ్యాటర్లను ఔట్ చేశాడు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ ఘన విజయం సాధించిది ఆసియా కప్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+