మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఇక ఇది తప్పనిసరి, తాజా నిర్ణయం..!!
మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నారు. పథకం అమలు వేళ కొత్త సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఉచిత ప్రయాణం కావడంతో ఒక్కసారిగా బస్సుల్లో రద్దీ పెరిగింది. కొన్ని స్టాపుల్లో బస్సులు ఆపడం లేదని, టికెట్ల కోసం రోడ్లపై బస్సులు ఆపేస్తున్నారన్న ఫిర్యాదులు అందాయి. కాగా, గుర్తింపు కార్డుల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కొందరి ఆధార్ కార్డుల్లో ఉన్న సాంకేతిక సమస్యలతో కండక్టర్లు ఉచిత ప్రయాణానికి నో చెబుతున్నారు. దీంతో, ఈ సమస్యపైన ఆర్టీసీ తాజాగా స్పష్టత ఇచ్చింది.
ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి వాటిల్లో ఏదైనా చూపించి ఉచితంగా ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. కాగా, కొందరి ఆధార్ కార్డులు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జారీ చేశారు. దీంతో చిరునామాలో తెలంగాణ అని కాకుండా ఆంధ్రప్రదేశ్ అని ఉంది.

అయితే ఆధార్ కార్డులో పేరు, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, ఇంటి పేరు, ఫింగర్ ప్రింట్స్ ఇలా ఏది మార్పించుకున్నా ఆంధ్రప్రదేశ్ అనేది మాత్రం మారలేదు. దీంతో ఆ కార్డుతో ప్రయాణించాలి అంటే చెల్లడం లేదు. ఆంధ్రప్రదేశ్ అని ఉండటంతో చెల్లదంటూ కొందరు కండక్టర్లు మహిళలకూ టికెట్లు కొడుతున్నారు. చిరునామా చివరలో ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ అని ఉంటేనే ఉచిత ప్రయాణానికి అర్హులు అవుతారని చెబుతున్నారు.
దీంతో, అడ్రస్ చివరలో తెలంగాణ వచ్చే విధంగా మార్చుకోవాలని కొంతమంది ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. తెలంగాణ అని మార్పించుకోవాలి అంటే దానికి అఫిడవిట్ చేయించాలి. అందుకు రూ.200 నుంచి రూ.350 వరకు వసూలు చేస్తున్నారు. ఇది సమస్యగా మారింది. దీంతో ఆర్టీసీ అధికారులు తాజాగా స్పష్టత ఇచ్చారు.
ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని చిరుమానా ఉంటే చాలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం జారీ చేసిన రెసిడెన్షియల్ అడ్రస్‌తో కూడిన గుర్తింపు కార్డులు కూడా చెల్లుబాటు అవుతాయని వెల్లడించారు. కండక్టర్లు తిరస్కరిస్తే టోల్‌ఫ్రీ నంబరు 040 69440000 కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications