70 లక్షల రైతుల ఖాతాల్లో నిధులు - తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్..!?

తెలంగాణలో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ తమదే అధికారం అనే ధీమాతో ఉంది. ఈ సమయంలోనే దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుమతి లభించింది. ఈ నిధులను ఈ నెల 28 లోగా జమ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 27. 28 తేదీల్లో ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్దమైంది.

రైతు బంధు నిధులు: తెలంగాణలో యాసంగి సీజన్ కోసం రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి లభించింది. శని, ఆదివారం కావటంతో ప్రచారం చివరి రెండు రోజులు ఈ నెల 27, 28 తేదీల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సీజన్ కోసం రైతుబంధు ఆర్దిక సాయం పంపిణీకి శుక్రవారం రాత్రి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

Rythubandhu funds to be credited in the beneficiaries account on 28th November in Telangana

దీనికి అనుగుణంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ -కుబేర్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో అర్హులైన 70 లక్షల మంది లబ్దిదారుల జాబితాను సిద్దం చేసి ఆర్దిక శాఖకు పంపారు. దీనికి అనుగుణంగా ఆర్దిక శాఖ రూ 7,700 కోట్లను ట్రెజరీల నుంచి నిధులను బ్యాంకులకు బట్వాడా చేయాలి.

28న రైతుల ఖాతాల్లోకి: శని, ఆదివారాలు సెలవు కావటంతో ట్రెజరీలు పని చేయలేదు. సోమవారం లేదా మంగళవారం ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం చేసారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోగానే రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

మంగళవారం ఉదయం నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియ ముగుస్తుంని వెల్లడించారు. రైతు బంధు సాయం పంపిణీకి సంబంధించి రాష్ట్రంలోని ట్రెజరీ, వ్యవసాయ శాఖ అధికారులకు శనివారమే సమాచారం అందింది. ఇక, ఎన్నికల్లో కీలక సమయంలో ఈ నిధుల జమ రాజకీయంగా ప్రభావం చూపుతుందా అనే చర్చ మొదలైంది.

ప్రభావం చూపిస్తుందా: ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. ఈ సమయంలో ఏకంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ అంశం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందనే ప్రచారం వేళ..ఈ నిధుల విడుదల ద్వారా ఏం జరుగుతుందనేది కీలకంగా మారుతోంది.

అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పుడు జమ అయ్యే నిధుల కంటే తాము అధికారంలోకి వస్తే రూ 15 వేలు రైతు బంధు కింద ఇస్తామని చెబుతున్నారు. కానీ, 70 లక్షల మంది ఖాతాల్లో సరిగ్గా పోలింగ్ కు 48 గంటల ముందు ఇవ్వటం ద్వారా ఎలాంటి ఎఫెక్ట్ రాజకీయంగా ఉంటుంది..ఎవరికి కలిసి వస్తుందనేది ఫలితాల్లోనే స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+