శబరి ఎక్స్‌ప్రెస్‌పై తాజా సమాచారం: అయ్యప్ప స్వాములకు సౌకర్యం
Sabari Express: వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

అదే సమయంలో సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌పై తాజా సమాచారాన్ని వెల్లడించారు రైల్వే అధికారులు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు కొత్తగా ఎల్‌హెచ్‌బీ బోగీలను అమర్చారు. ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఈ ఎక్స్‌ప్రెస్‌కు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జర్మనీకి చెందిన లింకె-హాఫ్మన్- బుష్క్ సంస్థ డిజైన్ చేసిన బోగీలు ఇవి. చెన్నై, పంజాబ్‌లోని కపుర్తలా, రాయ్‌బరేలీల్లో గల రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో ఇవి తయారవుతాయి. ఐసీఎఫ్ రూపొందించిన బోగీలతో పోల్చుకుంటే ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మరింత సౌకర్యంగా, విలాసవంతంగా ఉంటాయి.
గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు రూపొందాయి. యాంటీ టెలిస్కోపిక్, అడ్వాన్స్‌డ్ న్యుమాటిక్ బ్రేక్ సిస్టమ్, యాంటీ కొలిషన్ అవాయిడ్ సిస్టమ్ ఇన్- బిల్ట్‌గా ఉంటాయి ఇందులో. సాధారణ ఐసీఎఫ్ బోగీలతో పోల్చుకుంటే బరువు తక్కువ. లైట్ వెయిట్ మెటల్‌ను దీని తయారీలో వినియోగిస్తారు.
2022లో రైల్వేల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల వినియోగం మొదలైంది. మొట్టమొదటిసారిగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై మెయిల్‌కు ఈ కోచ్‌లను అమర్చారు. క్రమంగా వీటిని విస్తరిస్తోన్నారు. తాజాగా.. సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఈ బోగీలను సమకూర్చారు.

ఉదయం 11:40 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే 17230 శబరి ఎక్స్‌ప్రెస్.. రెండోరోజు సాయంత్రం 6:50 నిమిషాలకు తిరువనంతపురం సెంట్రల్ చేరుకుంటుంది. ఉదయం 7 గంటలకు తిరువంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరే నంబర్ 17229 ఎక్స్‌ప్రెస్ రెండో రోజు మధ్యాహ్నం 12:24 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, మొరప్పుర్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఒట్టప్పాలెం, షోరనూర్, త్రిశూర్, ఆలువా, ఎర్నాకుళం, కొట్టాయం, చంగనసేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావెలికారా, కాయంకుళం, కొల్లం, వర్కలశివగిరి మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.
-
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..!












Click it and Unblock the Notifications