హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ .. కారణం ఇదే..
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం పై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కమిషన్ రిపోర్టులో తన పేరు తొలగించాలన్నారు. పీసీ ఘోష్ కమిటీ రిపోర్టును క్వాష్ చేయాలని కోరారు.
సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 665 పేజీల రిపోర్టులో తనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన కమిషన్.. తన వివరణ తీసుకోలేదని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు పీసీ ఘోష్ కమిటీ రిపోర్టును క్వాష్ చేయాలని కోరారు. అలాగే ఈ రిపోర్టు ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

ఇక మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రాజెక్టులో అక్రమాలు, లోపాలు ఉన్నాయని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ అగస్టు 2025 లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇటీవల అసెంబ్లీలో కూడా కమిషన్ ఇచ్చిన రిపోర్టు గురించి సీఎం ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సబర్వాల్ సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications