Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్‌ను తిట్టేందుకేనా సభలు?: రేవంత్ రెడ్డికి కంటగింపు అంటూ సబిత ఫైర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శాసనసభలో తాను కనిపిస్తేనే సీఎం రేవంత్​ రెడ్డికి కంటగింపుగా ఉందని మండిపడ్డారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని 4 గంటలు నిలబడినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం రేవంత్​ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ భవన్​‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్​ఎస్​ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మేం ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని అన్నారు. వారు మహిళలకు అవకాశం ఇవ్వాలని అన్నారని గుర్తు చేశారు. వైఎస్​ఆర్​, చంద్రబాబు, కేసీఆర్​ మహిళలకు సభలో ఎంతో గౌరవం ఇచ్చేవారని కొనియాడారు. కానీ, సీఎం రేవంత్​ రెడ్డికి మాత్రం తాను సభలో కనిపిస్తేనే కంటగింపుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌​ను తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉందని సబిత మండిపడ్డారు.

Sabitha Indra Reddy fires at CM Revanth Reddy for his objectionable comments

సభలో 9 మంది మహిళా సభ్యులుంటే మాట్లాడే అవకాశమే రావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. చట్టసభల్లోనూ మహిళల పట్ల వివక్ష చూపటం సరికాదు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడుదామనుకుంటే మైకు ఇవ్వలేదు. మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. పార్టీ మారటం పెద్ద నేరం అయితే ఇప్పుడు కాంగ్రెస్​‌లోకి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు చేరలేదా?. నా వల్ల సీఎల్పీ పదవి పోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు ఎస్సీ నేతకు సీఎం పదవి ఇవ్వాలని ఆయన ఎందుకు అడగలేదు? అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

సభలో లేని ఎమ్మెల్సీ కవిత గురించి సభలో ఎందుకు ప్రస్తావించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. ఆడబిడ్డ అయితే శత్రువు కుమార్తె అయినా జాలి చూపే సమాజం మనదని హితవు పలికారు. తమను అవమానించిన తీరును రాష్ట్రమంతా గమనించిందన్నారు. రాష్ట్రంలో, హైదరాబాద్‌​లో మహిళలకు భద్రత కరువైందని ధ్వజమెత్తారు. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాల గురించి సీఎం రేవంత్​ రెడ్డి స్పందించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమోనని మహిళలు ఆశగా చూస్తున్నారన్నారు.

బీఆర్​ఎస్​ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సభలో జూనియర్​ శాసనసభ సభ్యులు మమ్మల్ని హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అత్యాచారాలకు కేంద్రంగా మారుతోందన్నారు. మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు. బాధితులకు భరోసా ఎక్కడ అని ప్రశ్నించారు. ఇటువంటివి ఎందుకు పునరావృతం అవుతున్నాయని, చర్యలు ఎక్కడ అని నిలదీశారు. ఆరోజు రేవంత్​ రెడ్డి ప్రచారంలో మాట్లాడిన మాటలకు తనపై కూడా మూడు కేసులు అయ్యాయని గుర్తు చేశారు సునీత లక్ష్మారెడ్డి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+