ఆపరేషన్ హుజూరాబాద్: టీబీజేపీలో మేధోమథనం: రాష్ట్ర కార్యాలయంలో ఈటల
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ నాయకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటైందీ భేటీ. ఇటీవలే కాషాయ కండువాను కప్పుకొన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్.. దీనికి హాజరయ్యారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ ఇందులో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వం వహించిన ఈ భేటీలో- హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్ల హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. 2004 నుంచీ టీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఈ నియోజకవర్గంలో ఎలా పాగా వేయాలనే అంశంపై బీజేపీ నాయకులు చర్చించారు. హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ పతనం ఆరంభం కావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?, ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై వారంతా చర్చించారు.

హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, ఈటల అనుచరుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఇదివరకు టీఆర్ఎస్ నుంచి కేప్టెన్ వీ లక్ష్మీకాంత రావు రెండుసార్లు, అనంతరం ఈటల రాజేందర్ నాలుగు సార్లు ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్‌కు గట్టిపట్టు, ఓటుబ్యాంకు ఉన్న స్థానం అది. ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరడంతో వర్గీయులు మెజారిటీ సంఖ్యలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. ఓటర్ల పల్స్, ఓటుబ్యాంకు ఎలా ఉందనే విషయంపై ఈ భేటీలో బీజేపీ నాయకులు చర్చించినట్లు చెబుతున్నారు.

Recommended Video
హుజురాబాద్ కోటపై ఈ సారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని, దుబ్బాక తరహా ఫలితాలన్ని అక్కడ సాధిస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలను గుమ్మరించినా టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదనే దీమాను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం అనేది హుజూరాబాద్ నుంచే ఆరంభమౌతుందని చెప్పారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా దక్కదని తేల్చి చెప్పారాయన. హుజురాబాద్‌లో పోటీకి చేయడానికి టీఆర్‌ఎస్‌కు అభ్యర్థే లేడని అన్నారు.












Click it and Unblock the Notifications