హైదరాబాద్ టూ షిరిడి.. ఇంత తక్కువ ధరకా.. IRCTC బంపరాఫర్

తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్ లో ప్రయాణికుల కోసం IRCTC టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా కేవలం రెండు రోజుల్లోనే షిరిడి యాత్రను పూర్తిచేసుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్.. సాయి సన్నిధి పేరిట ఈ యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాత్రకు సంబంధించిన ట్రైన్ టికెట్లు IRCTC అధికారిక వెబ్ సైట్ లో సెప్టెంబర్‌ 24 నుంచి నవంబర్‌ 12 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

షిరిడి సాయి ఆలయం మహారాష్ట్రలోని షిరిడిలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. సాయిబాబా 60 సంవత్సరాలకు పైగా షిరిడిలో నివసించి, 1918లో అక్కడే మరణించినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో సాయిబాబా సమాధి మందిరం ఉంటుంది. ఈ దేవస్థానానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడి ఆలయంలో భక్తులు కాకడ్ హారతి (ఉదయం), మధ్యాహ్న హారతి, అలాగే ధూప్ హారతి.. వివిధ హారతులను నిర్వహిస్తారు.

అయితే కేవలం రెండు రోజుల్లో షిరిడి యాత్రను పూర్తి చేసే అవకాశం కల్పించింది IRCTC . అది కూడా రూ. 5 వేలకే కావడం విశేషం. సాయి సన్నిధి పేరిట ఈ యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాత్రకు సంబంధించిన టికెట్లు సెప్టెంబర్‌ 24 నుంచి నవంబర్‌ 12 వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి బుధవారం సాయంత్రం కాచిగూడ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌ రైలు స్టార్ట్ అవుతుంది. ఈ రైలు బాసర, కామారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌ గిరి, నిజామాబాద్‌ స్టేషన్లలో ఆగుతుంది.

Sai Darshan on a Budget IRCTC Shirdi Tour Package for Just Rs 5 000

టికెట్ ధరలు చూస్తే.. థర్డ్ ఏసీ ఒక్కో ప్రయాణికుడు సింగిల్‌ షేరింగ్‌ రూమ్‌ కు రూ.7,890, డబుల్ షేరింగ్‌ కు రూ.6,660 చెల్లించాలి. ట్రిపుల్‌ షేరింగ్‌ కు రూ.6,640 ఉంటుంది. అలాగే 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ కు రూ.5,730, విత్‌ అవుట్‌ బెడ్‌ కు రూ.5,420 చెల్లించాలని IRCTC పేర్కొంది. ఇలా ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైలులో 3 ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం చేయాలి. వీటితో పాటు ప్యాకేజీలో భాగంగా షిరిడిలో ఉండేందుకు వసతి, ఉదయం అల్పాహారం ఉచితంగా అందిస్తారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+