సజ్జనార్ సూపర్ ప్లాన్.. 'స్టాలిన్' సినిమా తరహాలో..
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. భారత్ లో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా దాదాపు 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు సమాచారం. దేశంలో ప్రతి గంటకు సుమారు 52 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్లు.. ఈ ప్రమాదాల్లో 20 మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక 2021లో..రోడ్డు ప్రమాదాల్లో మొత్తం లక్షా 55 వేల మందికిపైగా మృతి చెందగా 2022లో మరణాల సంఖ్య 9 శాతం పెరిగినట్లు సమాచారం.
ఇక తెలంగాణలో 2021 నుంచి రోడ్డు ప్రమాదాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. 2024 లో తెలంగాణలో 26 వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. సగటున రోజుకు 18 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో మొదటి పది రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగంగా వెళ్లడంతోపాటు హెల్మెట్ ధరించకపోవడం.. సీట్ బెల్ట్ ధరించకపోవడం లాంటి కారణాలే అధికంగా కనిపిస్తున్నాయి.
🚗🪖 #SafeRideChallenge
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 13, 2025
Safety never goes out of style!
Every ride begins with a choice to protect yourself and those you love.
Before you start your car or bike:
✅ Fasten your seatbelt
✅ Strap on your helmet
✅ Record a short clip/take a photo and tag 3 friends to take the… pic.twitter.com/OuaOjdxneW
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వినూత్నంగా ఆలోచించారు. నూతన విధానాన్ని తీసుకొచ్చారు. తాజాగా #SafeRideChallenge అనే సోషల్ మీడియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా వాహనదారులు రోడ్డుపైకి వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, సీటు బెల్టు పెట్టుకోవడాన్ని చిన్న వీడియో తీసి ఆ వీడియోను ముగ్గురు స్నేహితులకు పంపించాలి. లేదా కుటుంబ సభ్యులనూ ట్యాగ్ చేయవచ్చు. ఈ విధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు వీసీ సజ్జనార్.

" సేఫ్టీగా ఉండటం కూడా స్టైల్ గా ఉండటమే. ప్రతి రైడ్ మీకు అవకాశాలను ఇస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు.. మీ కుటుంబానికి రక్షణ కల్పించేందుకు. మీరు కారు లేదా బైక్ స్టార్ట్ చేసేముందు ఇవి గుర్తుపెట్టుకోండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. ఈ వీడియోను రికార్డ్ చేయండి లేదా ఫొటోను షేర్ చేయండి. దీన్ని ముగ్గురికి షేర్ చేయండి. ఈ విధంగా సోషల్ మీడియాలో మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. మనందరం కలిసి 2025 ను సేఫ్టీ ట్రెండ్ గా మారుద్దాం.." అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications