అర్ధరాత్రి ఒంటిగంటకే సలార్ ఫస్ట్ షో: టికెట్ రేట్లు భారీగా పెంపు: రేవంత్‌కు రిక్వెస్ట్: ఊ అంటారా?
Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.
సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్.. మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.

ప్రభాస్ అభిమానులు ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సలార్ ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకుంటోంది. థియేటర్ల వద్ద సందడి చేయడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటోన్నారు ప్రభాస్ అభిమానులు.
నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ మూవీ నైజాం ఏరియా హక్కులను కొనుగోలు చేసింది. దీనికోసం ఫ్యాన్సీ రేట్‌కు నైజాం ఏరియా హక్కులను తీసుకుంది మైత్రీ మూవీస్.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలను పంపించింది. ఈ సినిమా రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లల్లో వంద రూపాయల మేర అదనంగా టికెట్ రేటును పెంచుకోవాలని ప్రతిపాదించింది. అలాగే- సినిమా విడుదల రోజైన డిసెంబర్ 22వ తేదీన ఆరు ఆటలకు అనుమతి ఇవ్వాలనీ కోరింది.
నైజాం ఏరియా వ్యాప్తంగా కూడా సలార్ తొలి షోను తెల్లవారు జామున 4 గంటలకే ప్రదర్శించాలని భావిస్తోన్నట్లు తెలిపింది. అలాగే కొన్ని ప్రధాన స్క్రీన్లపై అర్ధరాత్రి ఒంటిగంటకే షోను ప్రదర్శించడానికి అనుమతులను కోరింది మైత్రీ మూవీస్ సంస్థ. ఈ ప్రతిపాదనలను సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖకు పంపించింది. దీనిపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు.












Click it and Unblock the Notifications