తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్‌ జీతాలు ఎంతో తెలుసా..?

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి పంచాయతీ ఎన్నికల కావడంతో రాజకీయంగా విశేష ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది.

మొత్తం 292 జడ్పీటీసీ మరియు 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడతలో రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 58 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనుండగా.. ఈనెల 23న మొదటి విడత ఎన్నికలు, నవంబర్‌ 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా సర్పంచ్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ స్థానిక ప్రజాప్రతినిధుల జీతాల వ్యవహారం మరో కీలక చర్చనీయాంశంగా మారింది.

salaries-of-sarpanch-mptc-zptc-and-zp-chairman-in-telangana

జీతాలు..

ప్రస్తుతం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నెలకు రూ.6,500 గౌరవ వేతనం పొందుతున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు నెలకు రూ.13,000 చొప్పున పొందుతుండగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు రూ.1 లక్ష వరకు జీతం పొందుతున్నారు. అయితే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఉపసర్పంచ్‌లు మాత్రం ఇప్పటికీ ఎలాంటి గౌరవ వేతనం పొందడం లేదు. దీంతో ఈ ఎన్నికల వేళ "మాకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి" అంటూ డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఎన్నికల ఖర్చు పరిమితులు..

రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు పరిమితులను కూడా ఖరారు చేసింది:

జడ్పీటీసీ అభ్యర్థి: గరిష్టంగా రూ.4 లక్షలు.

ఎంపీటీసీ అభ్యర్థి: రూ.1.5 లక్షలు.

సర్పంచ్ అభ్యర్థి: రూ.2.5 లక్షలు.

ఈ పరిమితిని అతిక్రమిస్తే అభ్యర్థి మూడు సంవత్సరాలపాటు పోటీ చేయలేరు. గెలిచినా పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎన్నికల ఫలితాల అనంతరం 45 రోజులలోపు ఖర్చు నివేదికను సమర్పించాలి. ఇక ఇప్పటికే మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ. రాణీకుముదిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష చేసి, పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+