లేకుండా సస్పెండని సండ్ర, నర్సారెడ్డి వ్యాఖ్య దుమారం
హైదరాబాద్: జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులను తెలంగాణ అసెంబ్లీ నుండి ప్రభుత్వం సస్పెండ్ చేసిన సమయంలో తాను సభలోనే లేనని, అలాంటప్పుడు తనను ఎలా సస్పెండ్ చేస్తారని సండ్ర వెంకట వీరయ్య ప్రశ్నిస్తున్నారు. జాతీయ గీతాన్ని అవమానించారని టీడీపీ సభ్యులను తెరాస ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

మండలిలో నర్సా రెడ్డి వ్యాఖ్యలపై దుమారం
మండలిలో టీడీపీ నేత అరికెల నర్సిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మంగళవారం దుమారం రేపాయి. ఓ విషయమై మాట్లాడుతూ.. ప్రభుత్వం గాజులు తొడుక్కుందా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సభలో దుమారం రేగింది. గాజులు తొడుక్కుందా అంటూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన నర్సారెడ్డి క్షమాపణ చెప్పాలంటూ తెరాస సభ్యులు పట్టుపట్టారు.
తాను లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వకుండా విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నర్సారెడ్డి అన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు మహిళలు నొచ్చుకునేలా ఉన్నట్లయితే క్షమాపణ కోరుతున్నానని అనడంతో వివాదం అంతటితో సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications