గతంలో ఎవరూ వాడని విధంగా..: కేసీఆర్‌పై మళ్లీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. కేసీఆర్ పాలన నీరో చక్రవర్తిని తలపిస్తోందని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. కేసీఆర్ పాలన నీరో చక్రవర్తిని తలపిస్తోందని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను గౌరవించడం లేదని, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించకుండా తమ గొంతు నొక్కుతున్నారని సండ్ర విమర్శించారు.

గతంలో ఎవరూ వాడని విధంగా పోలీస్ వ్యవస్థను వాడుతున్నారని, ప్రజల మధ్య అశాంతి నెలకొల్పి శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్నారు.
మంచి పోస్ట్‌ల కోసం కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి వంతపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు గళం విప్పాలని కోరారు.












Click it and Unblock the Notifications