సంగారెడ్డి అదనపు కలెక్టర్ సీసీ అనుమానాస్పద స్థితిలో మృతి

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వద్ద సీసీగా పనిచేస్తున్న విష్ణువర్ధన్ (44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం ఉదయం కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్‌షిప్ వద్ద మంటల్లో కాలిపోయిన విష్ణువర్ధన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో నెల రోజులుగా సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లనట్లు తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణువర్ధన్‌కు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి, కుమారుడు హర్షవర్ధన్ ఉన్నారు. రాత్రి సమయంలో భార్య.. విష్ణువర్ధన్‌కు ఫోన్ చేస్తే మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, అనారోగ్య కారణాలతో గత నెల రోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

sangareddy additional collector cc vishnuvardhan suspiciously died

ఈ క్రమంలో విష్ణువర్ధన్‌ది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? దాని కారణంగా విష్ణువర్ధన్ ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విష్ణువర్ధన్ మంటల్లో కాలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న విష్ణువర్ధన్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్మ

గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం ఘోర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విగతజీవులుగా కనిపించారు. వారంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాంట్రాక్టర్‌గా పనిచేసే మనీశ్ సోలంకి (37), అతడి తల్లిదండ్రులు, భార్య, ఆరేళ్ల కుమారుడు, 10, 13 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు వారి ఇంట్లోనే విగత జీవులయ్యారు. మనీశో సోలంకి మృతదేహం ఉరితాడుకు వేలాడుతుండగా.. మిగిలినవారి మృతదేహాలు మంచం, నేలపైన పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారింట్లో విషం సీసా, సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతోనే వీరంతా ఆత్మహత్యకు పాల్పడనిట్లు పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+