టిప్పర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 22 మందికి గాయాలు.!
సంగారెడ్డి జిల్లా కంది దగ్గర నేషనల్ హైవే 65పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు మెదక్ నుంచి పటాన్ చెరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. కంది దగ్గర జాతీయ రహదారి 65పై ఆగి ఉన్న టిప్పర్ ను వెనకాల నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి ముందుగానే శివంపేట దగ్గర స్కూటీని బస్సు ఢీ కొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు.
గాయపడిన వాళ్లను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు మెదక్ నుండి పటాన్ చెరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే భారీ ప్రాణనష్టం వాటిల్లేదని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు.

మరోవైపు గతనెలలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. తాండూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.












Click it and Unblock the Notifications