ఇంత దారుణమా..? పెళ్లి పేరుతో యువకుడ్ని ఇంటికి పిలిచి మరీ..

ప్రేమ వ్యవహారం నేపథ్యంలో మరో యువకుడు బలయ్యాడు. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కారణంతో బీటెక్ స్టూడెంట్ ను అమ్మాయి తల్లిదండ్రులు అత్యంత దారుణంగా హత్య చేసిన దారుణమైన ఘటన కలకలం రేపుతోంది. పెళ్లి గురించి మాట్లాడుకుందాం రా అని ఇంటికి పిలిపించుకుని హత్య చేయడంపై యువకుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రేమ వ్యవహారం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కారణంతో పెళ్లి విషయంపై మాట్లాడుకుందామని యువకుడికి మాయమాటలు చెప్పి ఇంటికి పిలిపించుకున్న యువతి తల్లిదండ్రులు అతడ్ని కిరాతకంగా హతమార్చారు. ఈ దారుణమైన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ సృజన లక్ష్మీ నగర్‌లో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..

జ్యోతి శ్రవణ్ సాయి అలియాస్ శివ(20) స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు. అయితే ప్రస్తుతం అతడు కుత్బుల్లాపూర్‌ లో అద్దె రూమ్ లో నివాసం ఉంటున్నాడు. మైసమ్మ గూడలో సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. అయితే సంగారెడ్డి జిల్లా బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19) తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసిందే. దాంతో పలుమార్లు సాయిని హెచ్చరించారు. కానీ వీరి ప్రేమ వ్యవహారం అలాగే కొనసాగింది. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Sangareddy Shocker Young Man Lured with Marriage Promise Brutally Murdered by Girl s Family

ఈ విషయం తెలుసుకున్న శ్రీజ తల్లిదండ్రులు.. యువకుడికి మాయమాటలు చెప్పారు. పెళ్లి విషయంపై మాట్లాడుకుందామని నమ్మించి తమ ఇంటికి పిలిపించుకున్నారు. ఈ క్రమంలో సాయి వారి ఇంటికి రాగానే శ్రీజ కుటుంబ సభ్యులు అతడిపై ఒక్కసారిగా దాడి చేసి బ్యాటుతో కొట్టి హత్య చేశారు. ఇక సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+