హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో శనివారం పగలు 42 డిగ్రీల ఎండతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు రాత్రి వరుణుడి దెబ్బకు నానా ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడ్డాయి.

జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మెహిదీపట్నం, బాగ్‌లింగంపల్లి, షేక్‌పేట్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి, సైనిక్‌పురి, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలు రాత్రి వర్షం దెబ్బుకు వణికిపోయాయి. రాత్రి 9.30 గంటల నుంచి మొదలైన ఈదురు గాలులు గంటకుపైగా వీచాయి.

పలు చోట్ల భారీ వృక్షాలు సైతం నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో పలు ప్రాంతాలలో అంధకారం అలుముకుంది. ఇంటి పైకప్పు కూలి బాగ్‌లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్‌ క్వార్టర్స్‌లో నివసించే సరోజ(70) మృతి చెందారు. పెద్ద సంఖ్యలో వృక్షాలు నేలకూలాయి.

పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

సుందరయ్య పార్కు సమీపంలో ఓ పెద్ద చెట్టుతో పాటు రెండు విద్యుత్తు స్థంభాలు నేల కూలాయి. కొత్తపేట పండ్ల మార్కెట్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఒక పండ్ల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. సకాలంలో సిబ్బంది స్పందించడంతో ప్రమాదం తప్పింది.

 పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

బన్సీలాల్‌పేట డివిజన్‌లో ఆరు ఇళ్లు దెబ్బ తినగా నలుగురికి గాయాలయ్యాయి. ఇక్కడి రామస్వామి కాంపౌండ్‌ ప్రాంతంలోని ఓ భవనం మొదటి అంతస్తు రేకులు ఎగిరిపడి సమీపంలో ఉన్న మరో నాలుగు రేకుల ఇళ్లపై పడ్డాయి. దీంతో ఆ ఇళ్లు ధ్వంసమయ్యాయి.

 పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

యాదమ్మ(50) అనే మహిళ తలకు గాయాలయ్యాయి. సీక్లాస్‌ కాలనీలో ఓ ఇంటి రేకులు పడిపోయి ముగ్గురికి గాయాలయ్యాయి. అలానే బీజేఆర్‌నగర్‌ ప్రాంతంలో అశోక్‌ అనే వ్యక్తి ఇంటిపై చెట్టు కూలి ధ్వంసమైంది.

 పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

పాతబస్తీతో పాటు రాజేంద్రనగర్‌లో గాలి వాన బీభత్సంలో పలు ఇళ్లు, చెట్లు నేల కూలాయి. ఖానాపూర్, దుర్గానగర్ చౌరస్తా, శివరాంపల్లి పరిసర ప్రాంతాలలో అంధకారం నెలకొంది. సికింద్రాబాద్ పార్శీగుట్ట, పద్మారావునగర్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.

 పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

బంజారాహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దోమలగూడలో అభిశ్రేయ ప్రైవేట్ భాయ్స్ హాస్టల్ పెంట్ హౌస్ రేకులు కూలిపోవడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

 పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

పగలు ఎండ.. రాత్రి వాన: గోడకూలి వృద్ధురాలు సరోజ మృతి

ఉస్మానియా యూనివర్సిటీ, శివం, బాగ్‌లింగంపల్లి, మల్కాజిగిరి తదితర ప్రాంతాలలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. బన్సీలాల్‌పేట కమాన్‌, కల్పనా చౌరస్తా తదితర ప్రాంతాల్లో రోడ్లపై వృక్షాలు కూలిపోయాయి.

English summary
Sarojamma old women died due to wall collapsed at EWS Quarters Baghlingampally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X