శిరీషను చంపేశారు: భర్త సతీష్‌చంద్ర ఏమన్నారంటే..?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/ఆచంట: తన భార్య శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనీ, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె భర్త సతీష్‌చంద్ర ఆరోపించారు. కాగా, హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్‌ ఆరుసుమిల్లి విజయలక్ష్మి అలియాస్‌ శిరీష మృతదేహానికి బుధవారంఅంత్యక్రియలు నిర్వహించారు.

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి చివరి మాటలివే: శిరీష, ప్రభాకర్‌ల మృతిపై ఎన్నో అనుమానాలు

అత్తవారి గ్రామంలో అంత్యక్రియలు

అత్తవారి గ్రామంలో అంత్యక్రియలు

శిరీష అత్తవారి గ్రామమైన పశ్చిమగోదావరి జిల్లా మట్టపర్తివారిపాలెంలో ఆమె అంత్యక్రియలు చేశారు. అనంతరం సతీష్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 8 గంటలకు శిరీష ఫోన్‌ చేసి ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పిందని తెలిపారు.

శిరీష మృతదేహం మంచంపై..

శిరీష మృతదేహం మంచంపై..

అర్ధరాత్రి ఒంటిగంటకు మరోసారి ఫోన్‌ చేసినా నిద్రలో ఉండడంతో తాను ఫోన్‌ తీయలేదని చెప్పారు. మంగళవారం ఉదయం 7గంటలకు పోలీసులు ఫోన్‌ చేయడంతో ఆర్‌జే ఫొటో స్టూడియోకి వెళ్లానని, అప్పటికే శిరీష మృతదేహం మంచంపై పడుకోబెట్టి ఉందని తెలిపారు.

చంపేశారు.. కీలక ఆధారాలు

చంపేశారు.. కీలక ఆధారాలు

‘ఉరేసుకుంటే మృతదేహం మంచంపై ఎందుకు ఉంది?' అని సతీష్ చంద్ర ప్రశ్నించారు. తన భార్యను చంపేశారని ఆయన ఆరోపించారు. తనకు స్టూడియో యజమాని వల్లభనేని రాజీవ్‌పైనే అనుమానం ఉందని అన్నారు. పోలీసుల దగ్గర కీలక ఆధారాలున్నాయని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సతీష్‌చంద్ర డిమాండ్‌ చేశారు.

కన్నీరుమున్నీరైన కూతురు

కన్నీరుమున్నీరైన కూతురు

ఇది ఇలా ఉండగా, తన కుమార్తె మృతికి రాజీవ్‌, శ్రావణ్‌, తేజస్విని కారణమని శిరీష తల్లి రామలక్ష్మి ఆరోపించారు. శిరీషను చంపేసే స్టూడియోకి తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. కాగా, తన తల్లి ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో చంపేశారని శిరీష కూతురు కన్నీరుమున్నీరుగా విలపించింది. తేజస్విని తన తల్లిపై కేసు పెట్టిందని తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Satish Chandra on Wednesday responded on his wife sirisha suspicious death.
Please Wait while comments are loading...