చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: నేటి నుంచే బుకింగ్
Special Trains from Charlapalli: అయ్యప్పస్వామి భక్తుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఈ క్రమంలో తాజాగా చర్లపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్ వంటి స్టేషన్ల నుంచి 10 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. శబరిమల యాత్రీకుల తాకిడి నేపథ్యంలో డిసెంబర్ చివరి వారం వరకూ అవి అందుబాటులో ఉండనున్నాయి.
డిసెంబర్ 13వ తేదీన 07117 ప్రత్యేక రైలు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కొల్లంకు బయలుదేరి వెళ్తుంది. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువళ్ల, చెంగన్నూర్, కాయన్‌కులం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

డిసెంబర్ 17, 31 తేదీల్లో 07119 ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి కొల్లంకు బయలుదేరి వెళ్తుంది. సికంద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
డిసెంబర్ 20న తేదీన 07121 ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి కొల్లంకు బయలుదేరి వెళ్తుంది. భువనగిరి, జనగాం, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగనూర్, కాయన్‌కుళం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
డిసెంబర్ 19, జనవరి 2 తేదీల్లో కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 07118, డిసెంబర్ 22న 07120, 22న 07122, 26న 07124 ప్రత్యేక రైళ్లు కొల్లం నుంచి చర్లపల్లికి చేరుకుంటాయి. ఆయా రైళ్లన్నీ కూడా కాయన్‌కుళం జంక్షన్, చెంగన్నూర్, తిరువల్ల, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, ఆలువా, త్రిశూర్, పాలక్కాడ్, పొదనూరు తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, చిత్తూరు, పకాల, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కేశముద్రం, వరంగల్, కాజీపేట, జనగాం, భువనగిరి మీదుగా చర్లపల్లి చేరుకుంటాయి.












Click it and Unblock the Notifications