తిరుపతి,చెన్నై వెళ్లే వారి కోసం రైల్వే కీలక నిర్ణయం- ఇక కొత్తగా..!!

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణీకుల కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే ప్రముఖ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా అధికారులు మరో నిర్ణయం అమలుకు సిద్దమయ్యారు. వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో, కొత్త గా తెలుగు రాష్ట్రాల మీదుగా వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి కానుంది. ఇదే సమయంలో ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లల్లోనూ ప్రయాణీకుల కోసం మరో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి, చెన్నై తో పాటుగా ఇతర ప్రధాన రైళ్లల్లో ఈ నిర్ణయ అమలు కానుంది.

సౌకర్యవంతంగా
రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌(ఎల్‌హెచ్‌బీ) ప్యాసింజర్‌ బోగీలకు ప్రయాణీకుల నుంచి ఆదరణ కనిపిస్తోంది. ఈ కోచ్ ల ద్వారా సౌకర్యంతో పాటుగా భద్రతా పరంగా నూ అనుకూలంగా ఉండటంతో వీటిల్లో ప్రయాణానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. జర్మన్‌ సాంకేతికతతో తయారవుతున్న ఈ కోచ్‌లను ఇప్పటికే 50శాతం రైళ్లకు వినియోగిస్తున్నారు. 2030నాటికి అన్ని రైళ్లు ఎల్‌హెచ్‌బీ లేదా వందేభారత్‌ తరహా కోచ్‌లతోనే పరుగులు తీసేలా ప్రణాళికలు సిద్దం చేసారు. ఈ కోచ్ ల్లో తక్కువ బరువు.. ఎక్కువ పొడవు, వెడల్పుతో తయారు చేస్తున్నారు.

SCR decided to induct more LHB general class coaches to 19 express trains

భద్రతా పరంగా
ఈ కోచ్ ల్లో ప్రత్యేకంగా భద్రతా పరంగానూ అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ కోచ్ ల్లో అమర్చిన యాంటీ టెలీస్కోపిక్‌ టెక్నాలజీ, అధునాతన ఎయిర్‌ డిస్క్‌ బ్రేక్‌ కారణంగా ప్రమాదా లు జరిగినప్పుడు, రైలు పట్టాలు తప్పినప్పుడు బోగీలు పల్టీ కొట్టకుండా ఉంటాయి. అలాగే, యాంటీ క్లైంబింగ్‌ సాంకేతికతతో లాక్‌ సెంటర్‌ బఫర్‌ కప్లర్‌ను కలిగి ఉండడం వలన ప్రమాదాలు జరిగినపుడు రైలు బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కకుండా ఉంటాయి. వీటిని గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించేందుకు అనువుగా రూపొందించారు. కుదుపులు లేని ప్రయాణం కోసం ఈ కోచ్‌లను వెస్టిబ్యూల్‌ డిజైన్‌తో తీర్చిదిద్దారు.

ఈ రైళ్లల్లోనూ అందుబాటులో
ఇక, తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే పలు రెగ్యులర్‌, స్పెషల్‌ రైళ్లకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వెళ్లే గోదావరి, విశాఖ, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో పాటుగా న్యూఢిల్లీ వైపు వెళ్లే తెలంగాణ, దక్షిణ్‌.. ముంబై వైపు వెళ్లే హుస్సేన్‌ సాగర్‌.. తిరుపతి వైపు వెళ్లే నారాయణాద్రి, పద్మావతి, సింహపురి ఎక్స్‌ప్రె్‌సలన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతోనే నడుస్తున్నాయి. తిరుపతి వైపు వెళ్లే వెంకటాద్రి, చెన్నై, శబరి తో పాటుగా వెళ్లే నర్సాపూర్‌, మచిలీపట్నం ఎక్స్‌ప్రె స్ లను త్వరలోనే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. త్వరలోనే ఈ రైళ్లల్లోనూ ఈ కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+