ఈ రైళ్ల ప్రయాణీకుల కష్టాలు తీరినట్లే - ఇక నుంచి కొత్తగా..!!

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల డిమాండ్ మేరకు ఎంపిక చేసిన రైళ్లల్లో కొత్త కోచ్ ల ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రస్తుతం రెండు జనరల్ కోచ్ లు ఉన్న రైళ్లలో వాటిని నాలుగుకు పెంచాలని డిసైడ్ అయింది. అధునీకరించిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అందుబాటు లోకి రానున్నాయి. జోన్‌ పరిధిలోని 21 జతల రైళ్లకు కొత్తగా 80 ఎల్‌హెచ్‌బీ బోగీలు అందుబాటు లోకి తెస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

SCR decided to induct new LHB coaches for super fast express trains for general passengers

దక్షిణ మధ్య రైల్వే పలు ప్రధాన రైళ్లలో కోచ్ ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. ఎంతో కాలంగా ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా పెంచాలనే డిమాండ్ ఉంది. ఇప్పటికీ పలు ప్రధాన రైళ్లలో రెండు కోచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జనరల్‌ బోగీల సంఖ్యను పెంచుతూ నిర్ణయంతీసుకుంది. రైల్వే శాఖ జనరల్ కోచ్ ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కోచ్ లలో సీట్ల సంఖ్య 100 ఉంటుంది. అధునాతనంగా ఈ కోచ్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ఎల్‌హెచ్‌బీ బోగీలను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది.

SCR decided to induct new LHB coaches for super fast express trains for general passengers

ఇప్పుడు జనరల్‌ క్లాస్‌లోనూ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అందుబాటులోకి తెస్తూ నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 19 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో 66 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశ పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 370 రైళ్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ బోగీలను దశల వారీగా ఏర్పాటు చేస్తున్నారు.

SCR decided to induct new LHB coaches for super fast express trains for general passengers

దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నారాయణాద్రి, దక్షిణ్, గౌతమి తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ జనరల్‌ కోచ్ లు ఇప్పటికే ప్రవేశ పెట్టారు. ఇక, ఇతర రైళ్లలో నూ సాధారణ ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తూ ఇదే తరహాలో కోచ్ లు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+