చర్లపల్లి నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు.. బేఫికర్

Special Trains from Charlapalli Railway Station: వీకెండ్‌లో ప్రయాణికుల రద్దీని నివారించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. చర్లపల్లి నుంచి ఏపీలో కాకినాడ టౌన్, నర్సాపూర్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొత్తం 20 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 28వ తేదీన తొలి రైలు పట్టాలెక్కనుంది.

దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ శ్రీధర్ విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో (శుక్రవారం) సాయంత్రం 7:20 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07031 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 4:30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.

SCR set to run special trains between Charlapalli to Kakinada Town and Narsapur during Weekends

మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో (ఆదివారం) సాయంత్రం 6:55 నిమిషాలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరే నంబర్ 07032 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 6:50 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది. నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా ఈ రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో (శుక్రవారం) రాత్రి 8:15 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07233 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 5:50 నిమిషాలకు నర్సాపూర్‌కు చేరుకుంటుంది.

మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో (ఆదివారం) రాత్రి 8 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 07234 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+