చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు

Special Trains: వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.

ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

SCR to run 26 Summer Special Trains from Charlapalli and Srikakulam Road

తాజాగా మరిన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రకటించారు. చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ మధ్య మొత్తం 26 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. 13వ తేదీ నుంచి జూన్ 24 వరకు ఈ రైళ్లు ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

13వ తేదీ నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి నంబర్ 07421 ప్రత్యేక రైలు శ్రీకాకుళం రోడ్‌కు బయలుదేరి వెళ్లుతంది. అలాగే- ఈ నెల 14వ తేదీ నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం శ్రీకాకుళం రోడ్ నుంచి 07422 ప్రత్యేక రైలు చర్లపల్లికి బయలుదేరుతుంది. మొత్తం 14 ట్రిప్పులు రాకపోకలు సాగిస్తుందీ ఎక్స్‌ప్రెస్.

నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి నంబర్ 07425 ప్రత్యేక రైలు శ్రీకాకుళం రోడ్‌కు బయలుదేరి వెళ్తుంది. అదే రోజు నంబర్ 07426 ప్రత్యేక రైలు శ్రీకాకుళం రోడ్ నుంచి చర్లపల్లికి బయలుదేరుతుంది. మొత్తం 12 ట్రిప్పులు ఈ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.

ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+