హైదరాబాద్‌లో నివసించే ఏపీ ఓటర్లకు గుడ్ న్యూస్
YS Jagan: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. సోమవారం రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.ఈ సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటోన్న స్థానికేతరులందరూ కూడా వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.
ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తోన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకుంటోన్నారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున వాళ్లు తరలిరానున్నారు. ఈ రెండు నగరాల నుంచి ఏపీకి బయలుదేరి వెళ్లడానికి ఓటర్లు పోటెత్తుతున్నారు.ఈ రద్దీని అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి రెండు సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

ఆదివారం సాయంత్రం 7:45 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07097 ప్రత్యేక రైలు.. మరుసటి తెల్లవారు జామున 6:30 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 7:50 నిమిషాలకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరే నంబర్ 07098 ప్రత్యేక రైలు.. మరుసటి రోజు ఉదయం 8:15 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
ఈ రైళ్లు పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, కృష్ణా కెనాల్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.












Click it and Unblock the Notifications