చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు: అరుణాచలం, చిదంబరం వెళ్లి రావొచ్చు

Special Trains: తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో వెలిసిన ప్రఖ్యాత వేళాంకణి మేరీ మాత ఉత్సవాలు త్వరలో ఆరంభం కానున్నాయి. 11 రోజుల పాటు కొనసాగుతాయి. ఆరోగ్యమాతను దర్శించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వేళాంకణికి వెళ్తుంటారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే, నైరుతి రైల్వే, సదరన్ రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రావడం ఆనవాయితీగా వస్తోంది.

SCR to run Special Trains to Velankanni from Charlapalli

ఈ క్రమంలో చర్లపల్లి నుంచి తిరువారూర్ వరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీ మీదుగా వేళాంకణికి రాకపోకలు సాగించనున్నాయి. దీనికి అవసరమైన అడ్వాన్స్ బుకింగ్.. ఆరంభమైంది.

ఈ నెల 27, సెప్టెంబర్ 8 తేదీల్లో ఉదయం 8:10 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07091 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు తిరువారూర్ కు చేరుకుంటుంది.

ఈ నెల 28, సెప్టెంబర్ 9 తేదీల్లో తిరువారూర్ నుంచి రాత్రి 11:35 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07092 ప్రత్యేక రైలు మూడో రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూర్ పోర్ట్, చిదంబరం, మైలాడుథురై, నాగపట్నం మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

కాగా- సదరన్ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను వేళాంకణికి నడిపించనున్నట్లు ఇదివరకే వెల్లడించింది. ఈ నెల 27, సెప్టెంబర్ 6వ తేదీ (బుధ, శనివారాలు) రాత్రి 8:40 నిమిషాలకు బాంద్రా టెర్మినల్ నుంచి బయలుదేరే నంబర్ 09093 ప్రత్యేక రైలు రెండు రోజు ఉదయం 7:40 నిమిషాలకు వేలాంకణ్నికి చేరుకుంటుంది.

ఈ నెల 30, సెప్టెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి 12:30 నిమిషాలకు వేళాంకణ్ని నుంచి బయలుదేరే నంబర్ 09094 ప్రత్యేక రైలు రెండో రోజు ఉదయం 10:30 గంటలకు బాంద్రా టెర్మినస్ చేరుకుంటుంది.

బోరీవలి, వాసై రోడ్, పన్వేల్, లోనావాలా, పుణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, మైలాడుథురై, నాగపట్నం మీదుగా వేళాంకణికి చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+