అప్రూవర్‌గా మారను: సెబాస్టియన్, ఆధారాల సేకరణలో ఈసి
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తాను అప్రూవర్‌గా మారబోనని నిందితుడు, తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం ప్రతినిధి హ్యారీ సెబాస్టియన్ స్పష్టం చేశారు. బెయిల్ షరతుల్లో భాగంగా సంతకం చేసేందుకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కార్యాలయానికి వచ్చిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
స్టీఫెన్‌సన్‌తో పాటు తనకు చాలా మంది ఆంగ్లో ఇండియన్స్ తెలుసునని ఆయన అన్నారు. స్టీఫెన్‌సన్ తనను మోసం చేశాడో లేదో ఆయనకూ తనకూ దేశానికీ తెలుసునని సెబాస్టియన్ అన్నారు. జి్మీ, మత్తయ్య, టిడిపి నేతగా రేవంత్ రెడ్డి తనకు తెలుసునని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, నోటుకు ఓటు కేసులో ఎసిబి చురుగ్గా దర్యాప్తు సాగిస్తూ ఉండగానే తాను కూడా స్వయంగా దర్యాప్తు చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసి) సిద్ధపడింది. ఇందులో భాగంగా ఆధారాలను సేకరించే పనిలో పడింది. రేవంత్ రెడ్డి, తదితరులు స్టీఫెన్‌సన్‌తో జరిపిన సంభాషణల ఆడియో, వీడియో టేపులను, పరికరాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుంచి ఇప్పించాలని కొరుతూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడింది.

ఎసిబి సమర్పించిన పత్రాలను ఇప్పటికే కోర్టు నుంచి ఎన్నికల సంఘం పొందింది. వీటిలో ఎఫ్ఐఆర్, రిమాండ్, కస్టడీ రిపోర్టులతో పాటు మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన స్టీఫెన్ సన్, మాల్కం టేలర్, జెస్సికా స్టీఫెన్‌సన్‌ల వాంగ్మూలాలు, నిందితుల అరెస్టు సమయంలో ఎసిబి సమర్పించిన వాంగ్మూలాలను ఈసి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి నేరుగా వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఎన్నికల సంఘం కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆడియో, వీడియో రికార్డింగ్ కాపీలు ఇవ్వాలని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీని ఆదేశించాల్సిందిగా కోర్టును కోరే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఈసి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications