Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

45 రోజుల్లో ఈ పని చేయకపోతే.. సర్పంచ్ పదవి ఊడక తప్పదా ??

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. తొలిదశలో 4,227 స్థానాలకు ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2,331 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే బీఆర్‌ ఎస్ 1,168 స్థానాల్లో.. బీజేపీ 189 స్థానాల్లో విజయం సాధించగా.. ఇతరులు 539 స్థానాల్లో గెలుపొందారు. రెండో దశలో 4325 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 2245 స్థానాల్లో గెలుపొందగా.. బీఆర్‌ఎస్ 1,188 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 268 స్థానాల్లో, ఇతరులు 624 స్థానాల్లో విజయం సాధించారు. మూడో విడతలో 4,159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్‌ మద్దతుదారులు 2,286 స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు.

కాగా డిసెంబర్ 22న నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సర్పంచ్ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు తమ వ్యయ వివరాలను 45 రోజుల్లోగా సమర్పించాలని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఈ గడువులోపు సమాచారం ఇవ్వని లేదా తప్పుడు వివరాలు అందించిన అభ్యర్థులు తమ పదవులను కోల్పోతారని, తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

sec-important-warning-to-sarpanch-about-expenses-list-with-in-45-days

ఈ మేరకు ఎస్‌ఈసీ కార్యదర్శి మకరంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించాలన్నారు. అనంతరం వాటిని టీఈ-పోల్ (TE-Poll) వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ఈ సమగ్ర నివేదికలను 2026, ఫిబ్రవరి 15లోపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)కు తప్పనిసరిగా సమర్పించాలని కార్యదర్శి మకరంద్‌ ఆదేశించారు.

ఎస్‌ఈసీ హెచ్చరికల ప్రకారం గడువులోగా సరైన వివరాలు ఇవ్వని లేదా తప్పుడు సమాచారం అందించినవారు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 23 కింద తమ పదవులను కోల్పోయే అవకాశం ఉంది. అంతే కాకుండా మరో మూడేళ్లపాటు భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీచేయకుండా వారికి నిషేధం వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇక ఎస్‌ఈసీ నిబంధనల ప్రకారం 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.1,50,000 వరకు.. వార్డు మెంబర్ అభ్యర్థులు రూ.30,000 వరకు ఖర్చు చేయవచ్చు. 5,000కు పైగా జనాభా ఉన్న పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థికి రూ.2,50,000, వార్డు సభ్యుల అభ్యర్థికి రూ.50,000 వరకు ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం నిర్ధారించింది. తొలి విడతలో పోటీ చేసిన అభ్యర్థులు 2026, జనవరి 24 లోపు, రెండో విడతలో పాల్గొన్నవారు జనవరి 27న, మూడో విడతలో ఎన్నికైనవారు జనవరి 30 లోపు తమ ఖర్చుల వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించాలని ఎస్‌ఈసీ ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+