సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అరుదైన ఘనత..: దేశంలోనే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందికి చిరపరిచితం. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మొత్తం 10 ప్లాట్‌ఫామ్స్, 11 ట్రాక్స్ ఉన్న స్టేషన్ నుంచి నిత్యం 180 రైళ్లు దేశం నలుమూలలకూ రాకపోకలు సాగిస్తోంటాయి. రోజూ సగటున లక్షన్నర మంది ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో అత్యధిక ఆదయాన్ని ఆర్జించే జోన్లల్లో ఒకటిగా ఉండే దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువు.

ఈ రైల్వే స్టేషన్ కు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. వివిధ రైళ్ల ద్వారా లభించే ఆదాయ ప్రాతిపదికన దీన్ని రూపొందించింది. దేశంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే టాప్-10 రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ కు నాలుగో స్థానం లభించింది. ప్రయాణికుల సంఖ్యాపరంగానే కాకుండా ప్రయాణ దూరం, టికెట్ల ధరలు- విక్రయాలు, ఆదాయాన్ని ఆర్జించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

Secunderabad Railway Station Grabs a Major Milestone With National Rank Highest Traffic and Revenue
  • అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసే టాప్ 10 రైల్వే స్టేషన్లల్లో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. మొత్తం ఈ స్టేషన్ నుంచి వచ్చే వార్షికాదాయం రూ. 3,337.66 కోట్ల రూపాయలు. అలాగే.. ఏటా సగటున 39,362,272 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు.
  • రెండో స్థానంలో హౌరా స్టేషన్ నిలిచింది. ఈ స్టేషన్ ఆదాయం రూ. 1,692.40 కోట్ల రూపాయలు. దీన్ని వినియోగించుకునే ప్రయాణికుల సంఖ్య 6.13 కోట్లు.
  • ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కు మూడో స్థానం లభించింది. ఈ స్టేషన్ మొత్తం రెవెన్యూ రూ. 1,299.31 కాగా.. సగటున ప్రతి సంవత్సరం 3.06 కోట్ల మంది ప్రయాణికులు దీన్ని వినియోగించుకుంటోన్నారు.
  • నాలుగో స్థానంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిలిచింది. ఈ స్టేషన్ వాటా 1,276.29 కోట్ల రూపాయలు. 2.78 కోట్ల మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ గుండా తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తోన్నారు.
  • హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ కు అయిదో స్థానం దక్కింది. దీని ఆదాయం రూ. 1,227.28 కోట్లు. 1.45 కోట్ల మంది ప్రయాణికుల రద్దీ నెలకొంటుంటుంది ఇక్కడ.
  • ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ ది ఆరో స్థానం. ఈ స్టేషన్ రెవెన్యూ రూ. 1,036.76 కోట్ల రూపాయలు. దీన్ని ఏటా 1.47 మంది ప్రయాణికులు వినియోగించుకుంటోన్నారు.
  • దీని తర్వాతి స్థానం.. అహ్మదాబాద్ కు దక్కింది. ఈ స్టేషన్ రెవెన్యూ రూ. 1,010.36.
  • రూ. 982.21 కోట్ల ఆదాయంతో ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ కూడా టాప్ 10 నిలిచింది. రూ. 976.00 కోట్లతో పుణే, 844.99 కోట్లతో ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్.. టాప్ 10లో చివరి రెండు స్థానాలను దక్కించుకున్నాయి.

ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ.. అదే స్థాయిలో ఉండట్లేదు కొన్ని రైల్వే స్టేషన్లకు. హౌరా స్టేషన్ 6.13 కోట్ల మంది ప్రయాణికులు సాగిస్తోన్నప్పటికీ.. ఆదాయం మాత్రం రూ. 1,692.40 కోట్లు మాత్రమే. న్యూఢిల్లీ స్టేషన్ 3.94 కోట్ల మంది ప్రయాణికులతోనే రికార్డు స్థాయిలో రూ. 3,337.66 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+