సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇకపై.. ప్రయాణికుల డిమాండ్ మేరకు..!
తెలంగాణలోని అతిపెద్ద రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రథమస్థానంలో ఉంది. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వేకు జోనల్ హెడ్ క్వార్టర్స్ గా ఉంది. నిత్యం వేలాది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు వేలాదిమంది ఈ రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రావెల్ చేస్తుంటారు. అయితే తాజాగా నెటిజన్లు ఓ విషయంపై సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్కడ చూసినా హిందీలో బోర్డులు దర్శనమిస్తాయి. తెలుగులో బోర్డులు చాలా అరుదుగా ఉంటాయి. దీంతో నిత్యం వేలాదిగా తెలుగు ప్రజలు ఈ స్టేషన్ నుంచి ట్రావెల్ చేస్తుంటారు. హిందీ బోర్డులు అర్థం కాకా ఇబ్బందులు పడుతున్నారు. ఆ బోర్డులను తెలుగులో కూడా పెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక భాషకు తగిన గౌరవం ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల భాషను వదిలి రైల్వే శాఖ హిందీకి ప్రాధాన్యతను ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే తీరుపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని పలు కంపార్ట్ మెంట్స్ లో హిందీ భాషలో బోర్డులు దర్శనమివ్వడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. RailOne యాప్ ద్వారా టికెట్ బుకింగ్ ఆన్ లైన్ లో సులభంగా ఎలా బుక్ చేసుకోవాలి..? అన్న ప్రశ్నకు హిందీతో పాటు తెలుగులోనూ స్పష్టమైన సమాచారం ఇస్తే ప్రయాణికులకు సౌకర్యమంతంగా ఉంటుందని నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. స్థానిక భాషను విడిచిపెట్టి హిందీకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. తక్షణమే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక రైల్ వన్ యాప్ ను ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇండియన్ రైల్వేస్ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ట్రైన్ ట్రాకింగ్, ఆహారం ఆర్డర్ చేయడం, ఫిర్యాదులు చేయడం, PNR విచారణ, రైల్వే సేవలతో సహా ప్రయాణికులకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందిస్తుంది. ఈ యాప్ ను రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) రూపొందించింది.












Click it and Unblock the Notifications