IAS స్మితా సబర్వాల్‌ సంచలన నిర్ణయం.. ఏం జరిగింది..?

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలలపాటు చైల్డ్‌ కేర్ లీవ్ తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఆమె లీవులో వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు స్మిత సబర్వాల్ కు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో ఐఏఎస్ కాత్యాయని దేవీ మెంబర్ సెక్రటరీగా నియమితులయ్యారు.

IAS స్మితా సబర్వాల్‌ కీలక ట్వీట్ చేశారు. తాను అనారోగ్యం బారిన పడినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. కొన్ని నెలలుగా నేను vertebral artery dissection అనే వ్యాధి నుంచి కోలుకుంటున్నాను. అది చాలా నొప్పితో కూడి ఉండే ప్రక్రియ. నేను మళ్లీ ధృడంగా మారుతాను. అని సెల్ఫీ వీడియో షేర్ చేశారు. ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఆమె లీవులో వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఆమె స్థానంలో ఐఏఎస్ కాత్యాయని దేవీ మెంబర్ సెక్రటరీగా నియామకం అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా పలు కీలక అంశాల్లో ప్రధాన పాత్ర పోషించిన స్మితా సబర్వాల్ తాత్కాలికంగా విధుల నుంచి దూరం కాగా.. కాత్యాయని దేవీ కొత్త బాధ్యతలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

గత కేసీఆర్‌ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్‌ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి సలహాకమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. దాంతో పాటు మిషన్‌ భగీరథ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్ వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత తగ్గింది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై స్మితా సబర్వాల్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు ప్రాధాన్యం లేని పోస్టింగులు ఇస్తూ వచ్చింది రేవంత్ సర్కార్. అంతేకాక అనేకసార్లు బదిలీ చేసింది. తొలుత రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా స్మితాకు పోస్టింగ్‌ ఇచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆమెను యువజనాభివృద్ధి, పర్యాటక & సంస్కృతి శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది.

అంతేకాక గతంలో HCU భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మితా సబర్వాల్ ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో ఆమెపై అనేక విమర్శలు వచ్చాయి. స్మితా సబర్వాల్ పై మిషన్ భగీరథ ప్రాజెక్టు విషయంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇక తెలంగాణలో పీపుల్స్ ఆఫీసర్ గా స్మితా సబర్వాల్ గుర్తింపు పొందారు. ఇప్పటివరకు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కలెక్టర్‌ గా పనిచేశారు.

Senior IAS Officer Smita Sabharwal Takes Six-Month Childcare Leave

అయితే తాజాగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించబోతున్న నేపథ్యంలో.. స్మితా సబర్వాల్ లీవ్ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆమె స్థానంలో పి. కాత్యాయిని దేవి (2007 బ్యాచ్ ఐఏఎస్)ని పూర్తి అదనపు SFC మెంబర్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+