నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చౌర‌స్తాలో చంటిపిల్లాడిలా మారిన డీయ‌స్ ప‌రిస్థితి...

|
Google Oneindia TeluguNews

ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీలో చ‌క్రం తిప్పిన అనుభ‌వ‌శాలి, ప్ర‌త్య‌ర్థి పార్టీని మ‌ట్టి క‌రిపించ‌డంలో ధీశాలి, రాజ‌కీయాల్లో ఫైరింగ్ త‌ప్ప మిస్ ఫైర్ తెలియ‌ని మేధావి, గురి చూసాడంటే ల‌క్ష్యం ఛేదించ‌క‌పోడం అసాద్యం., ఉమ్మ‌డి రాష్ట్ర‌ రాజ‌కీయాల్లో అంత‌టి చురుకైన రాజ‌కీయాలు నెరిపిన డీ.శ్రీ‌నివాస్ అలియాస్ డీయ‌స్ ప్ర‌స్తుత రాజ‌కీయ ప్ర‌స్థానం పై 'కారు'చీక‌ట్లు క‌మ్ముకున్నాయి. గులాబీ పార్టీలో భ‌విశ్య‌త్ ప్ర‌శ్నార్ధ‌క‌మ‌వుతున్న త‌రుణంలో ఏ పార్టీ వైపు వెళ్లాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి వైరి పార్టీల‌ను ఛిత్తు చేసే ప్ర‌ణాళిక‌లు రచిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా ఉండాల్సిన ఆయ‌న ఏకాకి జీవితం గ‌డుపుతున్నారు. డీయ‌స్ పొలిటిక‌ల్ జ‌ర్నీ ఎలా ఉండ‌బోతోంది..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

డీయ‌స్ ను ఏకాకిని చేసిన గులాబీ ద‌ళం.. అలుముకున్న 'కారు' చీక‌ట్లు

డీయ‌స్ ను ఏకాకిని చేసిన గులాబీ ద‌ళం.. అలుముకున్న 'కారు' చీక‌ట్లు

సీనియర్ నేత డి.శ్రీనివాస్ రాజ‌కీయ పరిస్థితి ఏ మాత్రం సంత్రుప్తిగా ఉన్న‌ట్టు క‌నిపంచ‌డం లేదు. చక్రం తిప్పాల్సిన సమయంలో ఆయన చక్రాల కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది. రాజకీయ చౌరస్తాలో నిలబడి లిఫ్ట్ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ పాలిటిక్స్ లో అత్యంత సీనియర్ నాయకుడైన డి.ఎస్ తాను ఇలాంటి స్థితికి చేరుకుంటానని కలలో కూడా అనుకోని ఉండరు. ఉన్న పార్టీలో కొనసాగలేక, మాజీ పార్టీలో చేరలేక ఆయన సతమతమౌతున్నారు. ఎన్నికల సమయం నాటికి రాజకీయంగా చురుగ్గా ఉండాలని భావిస్తున్న డి.ఎస్ ఇప్పుడు తనకెంతో ఇష్టమైన సంయమనాన్ని పాటిస్తున్నారు.

తెలంగాణలో డీయ‌స్ ప‌రిస్థితి దారుణం.. ఎటు వెళ్లాలో తెలియ‌ని అయోమ‌యం..

తెలంగాణలో డీయ‌స్ ప‌రిస్థితి దారుణం.. ఎటు వెళ్లాలో తెలియ‌ని అయోమ‌యం..

అయితే త్వరలోనే ఆయన సరైన నిర్ణయం తీసుకుంటేనే తెలంగాణ పాలిటిక్స్ లో క్రియాశీలకంగా ఉండే అవకాశముంది.ఎం.పి కవిత తిరుగుబాటు చేసే వరకు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ సర్దుకుపోవాలనే భావించారు. స్వేచ్ఛ లేకపోయినప్పటికి అణిగిమణిగి పనిచేయడానికి ఆయన మానసికంగా సిద్దమయ్యారు.టీఆర్ఎస్ లో చేరినప్పుడే ముఖ్యమంత్రి పదవిపైన ఆశలు వదులుకున్నారు.అన్ని కుదిరితే వచ్చే ఎన్నికల్లో గెలిచి మంత్రి కావొచ్చునన్న అంచనాలో ఉన్నారు.ఇదే సమయంలో కేసీఆర్ కూడా డి.ఎస్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా తగిన రీతిలోనే గౌరవించారు.
అయితే డి.ఎస్ కుమారుడు అర్వింద్ బీజేపీలో చేరి యాక్టివ్ కావడంతో ఆయనకు అసలు సమస్య ప్రారంభమైంది. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో భారతీయ జనతా పార్టీకి మంచి పట్టుండంతో అర్వింద్ దూసుకుపోతున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిస్థితి క్లిష్టతరంగా మారుతుందని భావించిన కవిత ఏకంగా డి.శ్రీవివాస్ కు స్కెచ్ గీశారు.పార్టీలో నుంచి బయటకు పంపించే పరిస్థితిని కల్పించారు.

క‌విత సంధించిన బాణం.. ల‌క్ష్యాన్ని ఛేదించింది..

క‌విత సంధించిన బాణం.. ల‌క్ష్యాన్ని ఛేదించింది..

నిజామాబాద్ టీఆర్‌ఎస్ లో ఇప్పుడు డి.ఎస్ ఏకాకి. కవిత మాట కాదని ఆయనను పార్టీ కార్యక్రమాలకు పిలిచే ధైర్యం ఏ నాయకుడికి లేదు.ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి తనతో మాట్లాడుతారని డి.ఎస్ భావించినప్పటికి ఇప్పటి వరకు అది జరగలేదు.అంటే చంద్రశేఖర్ రావు కూడా శ్రీనివాస్ ను వదిలించుకునే ఆలోచనలో ఉన్నట్లు అర్థమౌతోంది.పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన మౌనాన్ని ఆశ్రయించారు.దీంతో డి.ఎస్ టీఆర్ఎస్ ను వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు కూడా చెపుతున్నారు.అయితే విచిత్రంగా డి.ఎస్ ను పార్టీలోకి ఆహ్వానించే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు.డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరాలంటే తమ కమిటీ అనుమతి ఉండాల్సిందేనని సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో నిజామాబాద్ మాజీ ఎం.పి మధు యాష్కీ మరో రకంగా స్పందించారు.

కొత్తొక వింత‌.. పాతొక రోత‌.. మాకొద్దు అంటున్న కాంగ్రెస్ నాయ‌కులు..

కొత్తొక వింత‌.. పాతొక రోత‌.. మాకొద్దు అంటున్న కాంగ్రెస్ నాయ‌కులు..

డి.ఎస్ కాంగ్రెస్ లో చేరడం యాష్కీకి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే డి.శ్రీనివాస్ అసలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశమే లేదని ఆయన తేల్చి చెపుతున్నారు. ఇప్పటి వరకు అధిష్టానం పెద్దలను కూడా డి.ఎస్ కలవలేదని యాష్కీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆయన మరో బాంబు కూడా పేల్చారు. బీజేపీలో చేరడానికి డి.శ్రీనివాస్ సిద్ధమయ్యారని చెప్పుకొచ్చారు. నిజంగా డి.ఎస్ విషయంలో ఇది కొత్త కోణం. అయితే కుమారుడు అర్వింద్ బీజేపీలో ఉన్నప్పుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరితే ఏ మాత్రం ప్రయోజనం ఉండదని ఆ పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అందుకే ముందుగా అర్వింద్ ను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదట జరిగాయి. కాని ఆయన మాత్రం తాను మోదీ భుక్తుడినని స్పష్టం చేయడంతో కాంగ్రెస్ ఆశలు వదులుకుంది. అందుకే డి.ఎస్ కూడా తమకు అవసరం లేదన్న రీతిలో ఆ పార్టీ నాయకులు వ్యవహారిస్తున్నారు. అయితే కాంగ్రెస్ తలుపులు పూర్తిగా మూసుకుపోయిన తర్వాతే డి.శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించే ఛాన్స్ ఉంది.

English summary
telangana senior leader d.srinivas not yet decided to stay in trs or join in another party. he is in dilemma that in which party he should join. present he is continuing in trs party but party not inviting him for any official programmes. so wants to quit trs. but suspense continuing that in which party he is going to join.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X