మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Mancherial: మంచిర్యాల సజీవదహనం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

|
Google Oneindia TeluguNews

మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవదహనం కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు బంకులో పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్న సీసీ ఫుటేజ్‌ దృశ్యాలని సేకరించారు. కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే శాంతయ్య భార్య సృజన ప్రధాన సూత్రధారిగా గుర్తించిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శాంతయ్య భార్య సృజన, కూతురు మౌనిక, సృజన సోదరుడు, లక్సెట్టిపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి లక్ష్మణ్‌, ఆటో డ్రైవర్‌, గుడిపల్లికి చెందిన మరో వ్యక్తితో పాటు గోదావరిఖనికి చెందిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

డిసెంబర్ 16న

డిసెంబర్ 16న

డిసెంబర్ 16న మంచిర్యాల జిల్లా మందమర్రి మంగుడిపల్లిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ ఇంట్లో మంటల్లో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇంటి యజమాని శివయ్య (50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కూతురు మౌనిక (23), ఆమె ఇద్దరు కుమార్తెలు హిమ బిందు (2), స్వీటీ (4), సింగరేణి ఉద్యోగి శాంతయ్య ఉన్నారు. ప్లాన్ ప్రకారమే అగ్నిప్రమాదం జరిగేలా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

రూ. 30 లక్షలు

రూ. 30 లక్షలు


మందమర్రి మండలం గుడిపెల్లికి చెందిన పద్మతోపాటు ఆమెతో సహజీవనం చేస్తున్న శాంతయ్యను చంపేందుకు నిందితులు సంవత్సరం క్రితమే కుట్ర పన్నినట్లు సమాచారం. 'లక్షెట్టిపేటలో డాక్యుమెంట్‌ రైటర్‌గా పని చేస్తున్న వ్యక్తితో శాంతయ్య భార్య సృజనకు నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు తెలిసింది. ఆ తర్వాత వీరిద్దరు.. శాంతయ్య, పద్మను హత్యే చేయించాలని నిర్ణయించుకున్నారు. హత్య చేసేందుకు మేడి లక్ష్మణ్ తో ఒప్పందం చేసుకున్నారూ. 30లక్షల విలువ చేసే భూమి ఇచ్చేటట్లుగా ఒప్పందం జరిగిందని తెలుస్తోంది.

పద్మ కోడలు

పద్మ కోడలు

నెల రోజుల క్రితం పద్మ కోడలు మంచిర్యాల ఆసుపత్రిలో బిడ్డను జన్మనిచ్చింది. వారిని చూసేందుకు పద్మ, శాంతయ్య ఆసుపత్రికి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఆటోను దుండగులు మంచిర్యాల పట్టణం సమీపంలో బొలెరోతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పద్మ, శాంతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

పెట్రోల్

పెట్రోల్

డిసెంబర్ 16న సాయంత్ర లక్ష్మణ్, మరో వ్యక్తి ఎరుకల రమేష్ తో కలిసి నస్పూర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేశారు.
ఆ పెట్రోల్ ను తీసుకుని ఆటోలో వెళ్లి శివయ్య ఇంటిపై చల్లారు అనంతరం మంట పెట్టారు. దీంతో ఇల్లు అగ్నికి ఆహుతయింది. నిందితులు బంకులో పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్న సీసీ ఫుటేజ్‌ దృశ్యాలను పోలీసులు సేకరించారు.

English summary
Mancherial, CCTV footage, burning alive, crime news,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X