వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊరూ వాడా రాజీవ్ గాంధీ జ్ఞాపకాలు.!30వ వర్ధంతి సందర్బంగా అంబరాన్నంటిన సేవా కార్యక్రమాలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఐటీ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చిన ఘ‌న‌త రాజీవ్ గాంధీకే ద‌క్కుతుంది, స్వర్గీయ రాజీవ్ గాంధీ స‌మ‌స‌మాజ స్థాప‌న కోసం చేసిన కృషి ఎప్ప‌టికి మ‌రువ‌లేనిదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతల ప్రియతమ నాయకుడు, భారతరత్న రాజీవ్ గాంధీ 30వ వర్థంతి కారక్రమాలను కంగ్రెస్ నేతలు ఊరూ వాడా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రిగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ వ్యాప్తంగా రాజీవ్ వర్ధంతి కార్యక్రమాలను సేవా కార్యక్రమాలతో ముడిపెట్టి కోవిడ్ బాదితులకు సాయం అందించారు కాంగ్రెస్ నాయకులు.

ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు.. సాంకేతిక రంగాన్ని రాజీవ్ పరుగులు పెట్టించారన్న రేవంత్ రెడ్డి..

ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు.. సాంకేతిక రంగాన్ని రాజీవ్ పరుగులు పెట్టించారన్న రేవంత్ రెడ్డి..

ఐటీ రంగాన్ని భార‌త‌దేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని టిపిసిసి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా హైద‌రాబాద్ సోమాజిగూడ స‌ర్కిల్ లోని రాజీవ్ గాంధీ విగ్ర‌హానికి పూల మాల‌లు వేసి నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడో పుట్టిన కంప్యూటర్ రంగాన్ని మ‌న దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకులనేలా చేసింది రాజీవ్ గాంధీనే అని గుర్తు చేసారు. గ్రామాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని, ఐటీ రంగంలో నేడు ఇండియా అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ గాంధీ కృషి ఫలితమే అన్నారు. అభివృద్దికోసం ఆఖరు రక్తపు బొట్టు వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారని రేవంత్ రెడ్డి కొనియాడారు.

దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు.. రాజీవ్ గాంధీ జ్ఞాపకాలను నెమరువేసుకున్న భట్టి..

దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు.. రాజీవ్ గాంధీ జ్ఞాపకాలను నెమరువేసుకున్న భట్టి..

టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు భట్టి విక్రమార్క.పేదరికాన్ని పారదోలడానికి, సమసమాజ స్థాపనకోసం రాజీవ్ గాందీ ఎంతో శ్రమించారని భట్టి గుర్తు చేసారు. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలకు తీసుకొచ్చారని భట్టి కొనియాడారు.

యువత అభ్యుదయం కోసం రాజీవ్ ఎన్నో కలలు కన్నారు.. ఘనంగా నివాళులు అర్పించిన వీహెచ్..

యువత అభ్యుదయం కోసం రాజీవ్ ఎన్నో కలలు కన్నారు.. ఘనంగా నివాళులు అర్పించిన వీహెచ్..

మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 30వ వర్థంతి సందర్భంగా పంజాగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఎం.పి. వి.హనుమంత రావు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రధాని సాంకేతిక రంగంలో, పంచాయతీ వ్యవస్థలలో పాటు యువత కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం స్థానిక పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు ఆయన ఫేస్ మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు అర్.లక్ష్మణ్ యాదవ్, బోల్లు కిషన్, శంభుల శ్రీకాంత్ గౌడ్, ఎస్.పి.క్రాంతి కుమార్, మొహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

సిలిండర్లు పంపిణీ చేసిన కోమటిరెడ్డి.. కరోనా లెక్కలను టీ సర్కార్ తప్పుగా చూపిస్తోందన్న భువనగిరి ఎంపీ

సిలిండర్లు పంపిణీ చేసిన కోమటిరెడ్డి.. కరోనా లెక్కలను టీ సర్కార్ తప్పుగా చూపిస్తోందన్న భువనగిరి ఎంపీ

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గా భువనగిరి ఏరియా హాస్పిటల్, బిబినగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి 25 ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. భారతదేశం ఈరోజు ఈ స్థితిలో ఉందంటే ఆరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణలు కారణమని కోమటిరెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రాలలో కరోనాను ఉచిత వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం అలా చేయండం లేదని మండిపడ్డారు. కరోనా అంశంలో తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, కరోనా ను ఆరోగ్యశ్రీ ఈరోజు చేర్చాలని కోమటిరెడ్డి డిమాండ్ చేసారు.

సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచిత భోజనం.. రాజీవ్ వర్థంతిని ఘనంగా నిర్వహించిన జగ్గారెడ్డి..

సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచిత భోజనం.. రాజీవ్ వర్థంతిని ఘనంగా నిర్వహించిన జగ్గారెడ్డి..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30 వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచిత భోజన ఏర్పాటు చేసారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి
హాస్పిటల్ లోని కోవిడ్ బాధితులకు, బాధిత కుటుంబాలకు,హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్స్ , నర్స్, సిబ్బందికి భోజనం అందచేశారు. సుమారు 1500 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ఆక్సీజన్ లేక ఇబ్బందిపడుతున్న కరోనా బాదితులకు ఉచితంగా ఆక్సీజన్ సిలిండర్లను అందిస్తున్నారు జగ్గారెడ్డి. అందుకోసం హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేసారు జగ్గారెడ్డి. టీపిసిసి పిలుపు మేరకు రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి కార్యక్రమాన్న జగ్గారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, కూతురు జయరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

పారిశుద్య కార్మికులకు సన్మానం.. రాజీవ్ వర్ధంతి సందర్బంగా ఎన్ఎస్ యూఐ వినూత్న కార్యక్రమం..

పారిశుద్య కార్మికులకు సన్మానం.. రాజీవ్ వర్ధంతి సందర్బంగా ఎన్ఎస్ యూఐ వినూత్న కార్యక్రమం..

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పారిశుధ్య కార్మికులను సన్మానించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్*
కారోనా విపత్కర సమయంలో పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని తెలుపుతూ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా వారిని సన్మానించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్ధ ఎన్ఎస్ యూఐ. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు అభిజీత్ యాదవ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ మరియు ఎన్ఎస్ యూఐ పిలుపు మేరకు స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి రోజున కాచిగూడ డివిజన్ కి సంబందించిన పారిశుధ్య కార్మికులను సన్మానించడం జరిగిందని వెంకట్ తెలిపారు.

English summary
Bharat Ratna Rajiv Gandhi, the beloved leader of the Congress leaders, celebrated the 30th death anniversary of the Congress leaders. The Congress leaders recalled the services rendered by Rajiv Gandhi to the country as the Prime Minister on this occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X