హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం.. ఓయో హోటల్‌లో విదేశీ, ఇతత రాష్ట్రాల యువతులతో సెక్స్ దందా!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న వ్యభిచార దందా గుట్టు రట్టు చేశారు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం. హైదరాబాద్ లో ఉన్న బ్యూటీ పార్లర్ లు, హోటళ్ళు, లాడ్జిలు కేంద్రంగా హైటెక్ వ్యభిచారం జరుగుతుంది. నిత్యం హైదరాబాదులో ఎక్కడో ఒకచోట వ్యభిచార ముఠాలు పట్టు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఓయో హోటళ్ళ కేంద్రంగా వ్యభిచారం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటికి ఓయో హోటళ్ళలో సాగుతున్న వ్యభిచారంపై అనేక కేసులు నమోదు అయ్యాయి.

ఓయో హోటల్లో వ్యభిచారం .. గుట్టు రట్టు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్

ఓయో హోటల్లో వ్యభిచారం .. గుట్టు రట్టు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎలాంటి భయం లేకుండా విచ్చలవిడిగా దందా సాగిస్తున్నాయి సెక్స్ రాకెట్స్ . నిత్యం అనేక చోట్ల దాడులు చేసి హైటెక్ వ్యభిచార ముఠాలను పోలీసులు పట్టుకుంటున్నా, హైదరాబాద్ నగరంలో సాగుతున్న వ్యభిచార దందా పోలీసులకు ప్రతిరోజు సవాల్ గానే మారింది. ఇక తాజాగా ఓయో హోటల్ కేంద్రంగా సాగిస్తున్న వ్యభిచార దందాలో ఒక విదేశీ యువతి, ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు, వ్యభిచారం నిర్వహిస్తున్న హోటల్ నిర్వాహకులను పోలీసులు పట్టుకున్నారు.

ఒక విదేశీ మహిళకు, ఆరుగురు ఇతర రాష్ట్రాల మహిళలకు విముక్తి

ఒక విదేశీ మహిళకు, ఆరుగురు ఇతర రాష్ట్రాల మహిళలకు విముక్తి

వ్యభిచార దందా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు చిన్న అంజయ్య నగర్ ఎంపైర్ ఓయో హోటల్ పై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ రైడ్ చేసింది. ఈ క్రమంలో వారు అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు నిర్ధారించుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఒక విదేశీ మహిళకు , ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు యువతులకు వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించి వారిని రెస్క్యూ హోంకు తరలించారు.

 సెక్స్ రాకెట్ అరెస్ట్ ... ముగ్గురు నిర్వాహకులపై కేసు

సెక్స్ రాకెట్ అరెస్ట్ ... ముగ్గురు నిర్వాహకులపై కేసు

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సారథ్యంలో, సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ దాడిలో వ్యభిచారం చేస్తున్న ఒక ఉజ్బెకిస్తాన్ యువతి, ఇద్దరు ఢిల్లీకి సంబంధించిన యువతులు, పశ్చిమ బెంగాల్ కు సంబంధించి మరో ఇద్దరు యువతులు, మరొకరు ముంబై కి సంబంధించిన యువతిని వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించి, రెస్క్యూ హోంకు తరలించారు. ఇక ఈ హోటల్ ను నిర్వహిస్తున్న జితేందర్, పుణేకు చెందిన శ్రీకాంత్, గచ్చిబౌలి కి చెందిన యు లక్ష్మయ్య లను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ అదుపులోకి తీసుకుని వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించింది.

గతంలోనూ ఓయో హోటళ్ళలో వ్యభిచారం

గతంలోనూ ఓయో హోటళ్ళలో వ్యభిచారం

వీరి వద్దనుండి ఆరు సెల్ ఫోన్లు, 81 వేల తొమ్మిది వందల రూపాయల నగదుతో పాటు 38 కండోమ్ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా సెప్టెంబరు నెలలో గచ్చిబౌలి పీజేఆర్ నగర్ లోని గ్యాస్ గోడౌన్ రోడ్డు లోని ఓ హోటల్ లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులు దాడులు చేసి అప్పుడు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను రెస్క్యూ చేశారు.

అంతకుముందు మే నెలలో మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా ఉన్న ఎన్ కన్వెన్షన్ వద్ద ఉన్న హైటెక్ టవర్ వద్ద ఓయో హోటల్లో కూడా వ్యభిచారం చేశారు. అప్పుడు కూడా పోలీసులు దాడులు చేసి వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు.

English summary
Hi-tech prostitution ring in Hyderabad. The Anti-Human Trafficking Team caught a sex racket with young women from foreign and local states at Oyo Hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X