ఓవైసీకి అమిత్ షాతో సంబంధాలు: షబ్బీర్ సంచలనం, బాబు-కెసిఆర్ 'జైలు' సవాల్‌పై ప్రశ్న

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసికి బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

తన పైన వచ్చన ఆరోపణల పైన సిబిఐ విచారణకు సిద్ధమేనని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఓవైసీ సోదరులు వారి పైన వచ్చిన ఆరోపణల పైన సిబిఐ విచారణకు సిద్ధమేనా అని సవాల్ చేశారు. ఓవైసీ సోదరులు దక్కన్ మెడికల్ కాలేజీలో నిబంధనలకు విరుద్ధంగా 90 మెడికల్ సీట్లు అమ్ముకున్నారన్నారు.

దారుసలాం బ్యాంకులో అవినీతి జరిగిందన్నారు. అక్బరుద్దీన్ 2009లో తన ఆస్తులను రూ.3 కోట్లుగా చూపారని, 2014 నాటికి అవి రూ.17 కోట్లకు ఎలా పెరిగాయో చెప్పాలని ప్రశ్నించారు. ఓవైసీ సోదరులు నాలుగు ఎకరాల్లో ప్యాలెస్‌ను ఎలా కట్టగలిగారన్నారు. వీటిపై విచారణకు సిద్ధమా అన్నారు.

Shabbir Ali hot comments in GHCM elections campaign

ఓవైసీ సోదరుల ఆశ్తుల పైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. షబ్బీర్ అలీ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ పైన కూడా మండిపడ్డారు. ఇరువురు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైలుకు పంపిస్తానన్న కెసిఆర్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కెసిఆర్‌ను జైలుకు పంపిస్తానని చెప్పిన చంద్రబాబు కూడా ఇప్పుడు మౌనంగా ఉన్నారన్నారు. ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఇదే నిదర్శనమన్నారు. తన వద్దనున్న మున్సిపల్ శాఖను మంత్రి కెటిఆర్‌కు అప్పచెబుతానని కెసిఆర్ చెప్పడం ద్వారా తన అసమర్థతను ఒప్పుకున్నారన్నారు.

విద్యుత్‌ను చూసి ఓటేయండి: కవిత

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఓటు వేసే ముందు ఇంట్లో వెలుగుతున్న కరెంట్ బుగ్గను చూసి ఓటేయ్యాలని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. అడిక్మెట్ డివిజన్‌లో ఎంపీ కవిత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే వారికి ఓటేయ్యండి. అధికారంలో లేని పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+