కేటీఆర్ కు సంబంధం లేదని నమ్మాలంటే..!!
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివాదం రాజకీయ రచ్చగా మారింది. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్ కాని హౌస్ లో ఈ పరిణామాలు చోటు చేసుకోవటంతో రాజ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసు పై బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. తాజాగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేసారు.
పొలిటికల్ వార్
ఈ దాడుల వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని కేటీఆర్ ఆరోపించారు. తమను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక, కక్షపూరిత రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని విమర్శించారు. అయితే, ఫిర్యాదు అంది పోలీసులు దాడులు నిర్వహిస్తే, దానికి సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు గుప్పించడం ఏమిటని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. రెడ్ హ్యాండెడ్ గా బావమరిది డ్రగ్స్ కేసులో చిక్కగా, కేటీఆర్ అర్దం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తాజాగా షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ డ్రగ్ టెస్టు చేయించుకోవాలని, టెస్ట్ లో నెగిటివ్ వస్తే తాము కూడా డ్రగ్స్ కు కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని భావిస్తామని చెప్పుకొచ్చారు.

రేవంత్ జైళ్లో ఉండగా
డ్రగ్స్ ప్రస్తావన కేటీఆర్ అక్కడ ఎందుకు ప్రత్యక్షం అవుతున్నారో అర్థం కావడం లేదని షబ్బీన్ అలీ వ్యాఖ్యానించారు. కేటీఆర్ బావమరిది పేకాట ఆడుతూ.. డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికిపోయాడని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయో ప్రజలకు తెలపాలని, ప్రభుత్వం కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని కోరారు. బీఆర్ఎస్ హాయంలో ని కక్షపూరితమైన ధోరణితో 40 రోజులు జైల్లో పెట్టారని, జైల్లోనే రేవంత్ ను చంపాలని ప్రయత్నించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతివారం రాజ్ పాకాల రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నారన్న, పక్కా సమాచారంతోనే పోలీసులు దాడులు చేశారన్నారు. త్వరలో వాస్తవాలను ప్రజలు ముందు పెడతామన్నారు. షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications