కలెక్టర్ ప్రీతి మీనాతో వివాదం: సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ శనివారం సచివాలయానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను ఆయన కలిశారు. కలెక్టర్ ప్రీతి మీనాతో వివాదం నేపథ్యంలో ఆయన సీఎస్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.

శంకర్ నాయక్ వెంట జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా సచివాలయానికి వచ్చారు. శుక్రవారం నాడు ఐఏఎస్‌ల సంఘం ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, ముత్తిరెడ్డిల మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. సీఎస్‌ను కలిసి తమ వాదన వినిపించినట్లు సమాచారం.

shankar naik met telangana chief secretary to discuss over the issue with collector

కాగా, కలెక్టర్ ప్రీతిమీనాతో వివాదానికి సంబంధించి శంకర్ నాయక్ ఇప్పటికే క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక జనగామ జిల్లా కలెక్టర్ దేవసేనతో వాగ్వాదంతో ముత్తిరెడ్డిపై కూడా ఐఏఎస్ లు సంఘానికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.

Uppal MLA NVSS Prabhakar About Water Problems in Hyderabad | Oneindia Telugu

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahabubabad MLA Shankar Naik and Janagao MLA Muthireddy Yadagiri Reddy are met Telangana CS SP Singh at Secretariat on Saturday.
Please Wait while comments are loading...