తెలంగాణకు కొత్త గవర్నర్‌గా డీహెచ్ శంకరమూర్తి!?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగుతున్న నరసింహన్ స్థానంలో శంకరమూర్తికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం.
బెంగుళూరు: తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారన్న వార్త ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక విధానపరిషత్ సభాపతి, బీజేపీ సీనియర్ నేత డి.హెచ్.శంకరమూర్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

కాగా, ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గతవారం శంకరమూర్తితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగుతున్న నరసింహన్ స్థానంలో శంకరమూర్తికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications