తెలంగాణ రైజింగ్ స్పీకర్లు వీళ్లే- జాబితాలో సినీ, క్రీడా అతిరథులు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు గడువు సమీపిస్తోంది. ఇంకొక్క రోజే మిగిలివుంది. ఈ నెల 8వ తేదీన ఈ కార్యక్రమం అరంగంగ వైభవంగా ఆరంభం కానుంది. రెండు రోజుల పాటు కొనసాగుతుంది. భారత్ ఫ్యూచర్ సిటీ దీనికి వేదిక. అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సును నిర్వహిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రపంచ నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.
రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, సీనియర్ అధికారులు ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోన్నారు. అంతర్జాతీయ ప్రతినిధులకు సాఫీగా ఆతిథ్యం, నిర్వహణను పక్కాగా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను సమీక్షిస్తోన్నారు. దీనికోసం ప్రజా భవన్ లో వార్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. దావోస్ వార్షిక వరల్డ్ ఎకనమిక్ ఫోరం స్థాయిలో సమ్మిట్‌ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఈ రెండు రోజుల సదస్సులో 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు ఉంటాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి పలు కీలక రంగాలపై ఈ చర్చలు జరుగుతాయి. ఆయా రంగాలకు చెందిన నిపుణులు ఇందులో ప్రసంగిస్తారు.
- ఈ సమ్మిట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
- తేరి (TERI), బీసీజీ, మైక్రాన్ ఇండియా, హిటాచీ ఎనర్జీ, అపోలో హాస్పిటల్స్, ఐఐటీ- హైదరాబాద్, నాస్కామ్, డీఆర్డీఓ, స్కైరూట్ వంటి సాంకేతిక, ఆరోగ్య, ఆవిష్కరణల రంగాల అగ్రశ్రేణి సంస్థల అధినేతలు హాజరు కానున్నారు.
- అముల్, కోటక్ బ్యాంక్, గోల్డ్‌మన్ శాక్స్, స్విగ్గీ, తాజ్ హోటల్స్ సహా పలు వ్యాపార, సేవా రంగాల ప్రముఖులు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతారు.
- 'ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్' అనే ప్రత్యేక సెషన్‌లో ప్రఖ్యాత క్రీడా ప్రముఖులు పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, గుత్తా జ్వాల పాల్గొంటారు. తమ అనుభవాలు తెలియజేస్తారు.
- 'క్రియేటివ్ సెంచరీ - సాఫ్ట్ పవర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్' అంశంపై జరిగే చర్చలో సినీ ప్రముఖులు ఎస్ఎస్ రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గునీత్ మోంగా, అనుపమ చోప్రా హాజరు కానున్నారు. ఈ రంగంలో గల అవకశాల గురించి వివరించనున్నారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications