వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమె చదివింది నాలుగో తరగతే.!అటవీ హక్కుల చట్టం గురించి ఏం తెలుస్తుంది.?బీజేపి మాజీ ఎంపీ ఫైర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పై గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు మాజీ ఎంపీ, బీజేపి సినియర్ నేత రమేష్ రాథోడ్. మంత్రి సత్యవతి రాథోడ్ కు అటవీ హక్కుల చట్టం గురించి కనీస అవగాహన లేదని, సత్యవతి రాథోడ్ 4వ తరగతి మాత్రమే చదివినట్లుందని, అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరని రమేష్ రాథోడ్ ఘాటుగా విమర్శించారు.

ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ గురించి ఆమెకేం తెలుసు..సూటిగా ప్రశ్నించిన మాజీ బీజేపీ ఎంపీ

ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ గురించి ఆమెకేం తెలుసు..సూటిగా ప్రశ్నించిన మాజీ బీజేపీ ఎంపీ

అంతే కాకుండా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ గురించి మంత్రి సత్యవతి తెలుసుకుంటే మంచిదిని హితవు పలికారు రమేష్ రాథోడ్. పోడు భూముల సమస్యను పరిష్కరించి పట్టాలు అందజేస్తామని గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదివాసీలను మోసం చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. పోడు భూములపై కమిటీ పేరుతో మరోసారి ఆదివాసీలను చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మోసం చేస్తున్నదని రమేష్ రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

పోడుభూముల కోసం సబ్ కమిటీ వేసారు.. ఎన్ని సార్లు గిరిజన ప్రాంతాల్లో పర్యటించారన్న రమేష్ రాథోడ్

పోడుభూముల కోసం సబ్ కమిటీ వేసారు.. ఎన్ని సార్లు గిరిజన ప్రాంతాల్లో పర్యటించారన్న రమేష్ రాథోడ్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాదిరిగానే చంద్రశేఖర్ రావు సైతం ఆదివాసీలను మోసం చేసేందుకే పోడు భూముల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని, సీఎం చంద్రశేఖర్ రావు వేసిన కమిటీ కేంద్రానికి లేఖ రాయడానికి ఉపయోగపడుతుందే తప్ప గురిజనుల సంక్షేమం కోసం కాదని రమేష్ రాథోడ్ ఎద్దేవా చేసారు. గిరిజన సబ్ కమిటీ వేసిన దగ్గర నుండి మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్ని గిరిజన ప్రాంతాల్లో పర్యటించిందో చెప్పాలన్నారు రమేష్.

 మంత్రులకు అపాయిట్ మెంట్ కూడా ఇవ్వని సీఎం.. గిరిజనులను ఉద్దరిస్తామంటే నమ్మేది ఎట్ల.?

మంత్రులకు అపాయిట్ మెంట్ కూడా ఇవ్వని సీఎం.. గిరిజనులను ఉద్దరిస్తామంటే నమ్మేది ఎట్ల.?


=ఎన్నికలయ్యాక ఏజెన్సీ ఏరియాకు వెళ్లి కుర్చీ వేసుకుని కూర్చుని, పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న సీఎం సీఎం చంద్రశేఖర్ రావు చేసిన ప్రగల్బాలు ఎటు వెళ్లాయని రమేష్ రాథోడ్ నిలదీసారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు కనీసం అపాయిట్ మెంట్ కూడా ఇవ్వని సీఎం చంద్రశేఖర్ రావు గిరిజనుల అభ్యున్నతికి ఏదో చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు రమేష్ రాథోడ్. 317 జీవో విషయంలో గిరిజన ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ అంశంపై దీక్ష చేసిన బండి సంజయ్ పై పోలీసులు దాడి చేయడం సిగ్గు చేటన్నారు రమేష్ రాథోడ్.

 టీఆర్ఎస్ నేతలు దోచుకోవడం, దాచుకోవడమే.. టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయన్న రమేష్ రాథోడ్

టీఆర్ఎస్ నేతలు దోచుకోవడం, దాచుకోవడమే.. టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయన్న రమేష్ రాథోడ్

ఇసుక సరఫరాలో ఆదిలాబాద్ జిల్లాకు ఒక నిబంధన, ఇతర జిల్లాలకు మరో నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శించారు. అధికారులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తులా పనిచేస్తున్నారని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని రమేష్ రాథోడ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు దోచుకోవడం, దాచుకోవడమే తప్ప గిరిజనులకు చేసింది శూన్యమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే గిరిజన సమస్యలను పరిష్కరిస్తామని రమేష్ రాథోడ్ స్పష్టం చేసారు.

English summary
Bjp former Mp Ramesh Rathore sharply criticized Minister Satyavathi Rathore for not having a minimum understanding of the Forest Rights Act and for saying that Satyavathi Rathod was only a 4th class student and therefore preferred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X