వేసవిలో షిర్డీ టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే అద్భుతమైన టూర్ ప్యాకేజీ..!

భారతదేశంలో ఎన్నో ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు ఎన్నో విశిష్టమైన ప్రదేశాలకు నిలయంగా మనదేశం ఉంది. ఇక మరికొన్ని రోజుల్లో సమ్మర్ సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను విజిట్ చేయాలని ఉందా..? మీకోసం ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా తక్కువ ధరకే మీరు షిర్డీ టూర్ వెళ్లి రావొచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

సాయిశివం పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఈ టూర్ ను నిర్వహిస్తోంది. ఈ టూర్ లో భాగంగా తక్కువ ధరకే షిర్డీ టెంపుల్ తో పాటుగా నాసిక్ లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రతి శుక్రవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటోంది. ఈ టూర్ మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్లుగా కొనసాగుతోంది.

టూర్ లో భాగంగా తొలిరోజు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అలా రాత్రంతా ప్రయాణించిన తర్వాత తెళ్లారి ఉదయం 7 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి వాహనాల్లో షిర్డీకి వెళ్తారు. అక్కడే రూమ్ తీసుకుని ఫ్రెషప్ అయిన తర్వాత సాయిబాబా దర్శనం ఉంటుంది.

Shirdi Summer Tour Package at Budget Price An Amazing Spiritual Getaway Shirdi summer tour package

ఇక మూడో రోజు నాసిక్ కు బయల్దేరుతారు. అక్కడ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అనంతరం పంచవటిలో సందర్శన ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు నాగర్ సోల్ రైలు స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ తర్వాత ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 17, 24 తేదీల్లో అలాగే మే 1, 8, 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+