కెసిఆర్‌పై శోభారాణి నిప్పులు, సవాల్ విసిరి, పారిపోయిన జూపల్లి!
మహబూబ్ నగర్: గతంలో బోగస్ పాసుపోర్టులతో మోసగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇప్పుడు బోగస్ వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి శనివారం విమర్శించారు.
ఎన్నికల సమయంలో బోగస్ హామీలు ఇచ్చిన కెసిఆర్ అధికారంలోకి వచ్చాక .. ఇప్పుడు బోగస్ సర్వేలు, బోగస్ ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. కెసిఆర్ పాలన అంతా ఓ బోగస్ అన్నారు. తేలుకు తోకలో విషముంటే, కెసిఆర్‌కు నిలువెల్లా విషమే అన్నారు.

కాగా, జూపల్లిపై రావుల చంద్రశేఖర రెడ్డి మండిపడిన విషయం తెలిసిందే. ఎవరిని మెప్పించేందుకు మంత్రి జూపల్లి కృష్ణా రావు సవాల్ విసిరానని, ఎన్టీఆర్ భవన్లో తాను నాలుగు గంటలపాటు ఎదురు చూశానని, అయన రాలేదని, జూపల్లి కన్నా పాలమూరుపై తనకే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పారు.
పాలమూరులోని ప్రాజెక్టుల పైన తాను జూపల్లికి బహిరంగ సవాల్ విసిరానని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వస్తానని ఆయన చెప్పారని, తాను సిద్ధమని ప్రకటించి శనివారం నాలుగు గంటల పాటు కూర్చున్నానని చెప్పారు. సవాల్ విసిరి, పారిపోయాడన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications