వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్ఫీల బ్రాండ్ అంబాసిడర్ కే షాక్.!ఈటల సెల్ఫీలు దిగుతుంటే సైడైపోయిన యువరాజు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో సెల్ఫీ లకు బ్రాండ్ అంబాసిడర్ గుర్తింపు తెచ్చుకుంది ఎవరు అంటే ఠక్కున ఎవ్వరైనా ఆ మంత్రిపేరు చెప్తారు. సెల్ఫీలకు అంత గుర్తింపు తెచ్చిన యువ మంత్రి ఎక్కడికి వెళ్లినా అభిమానులకు గుర్తుగా తప్పకుండా ఓ సెల్ఫీ తీసుకుని దాన్ని సోషల్ మీడియా లో వైరల్ చేస్తుంటారు ఆ యువ మంత్రి. పెద్ద పెద్ద కార్పోరేట్ పారిశ్రామిక దగ్గజాల నుండి సామాన్య అభిమానుల వరకూ ఈ సెల్ఫలతో తృప్తిపరుస్తుంటారు ఆ యువ మంత్రి. తెలంగాణలో సెల్ఫీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ముద్ర వేసుకున్న మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు చిత్రమైన సంఘటన ఎదురైంది.

 సెల్ఫీ ల స్పెషలిస్టుగా ఆ యువ మంత్రికి గుర్తింపు.. కానీ ఆ రోజు సెల్ఫీ ఎవ్వరూ దిగని పరిస్ధితి

సెల్ఫీ ల స్పెషలిస్టుగా ఆ యువ మంత్రికి గుర్తింపు.. కానీ ఆ రోజు సెల్ఫీ ఎవ్వరూ దిగని పరిస్ధితి

ఏదైతే సెల్ఫీకి అధిక ప్రాదాన్యతనిచ్చి ప్రాచూర్యం కల్పించారో అవే సెల్ఫీలు ప్రత్యర్ధి పార్టీ నేత దిగుతుండడం, ఆ సమయంలో అటుగా వచ్చిన కేటీఆర్ ను ఎవ్వరూ పట్టించుకోకుండా సదరు ఎమ్మెల్యేతో సెల్ఫీలు కొనసాగించడం ఆశ్యర్యానికి గురిచేసింది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్న నానుడి ఎవరు కనిపెట్టారో గానీ అది వందకు వంద శాతం వాస్తవం అనే ఉదంతాలు వెలుగుచూస్తుంటాయి. ఇంకా నాటుగా చెప్పాలంటే రాజకీయాల్లో బండ్లు ఓడలవుతుంటాయి, ఓడలు బండ్లవుతుంటాయి. అది కళ్లముందు జరిగిపోతుంటుంది కూడా.

 యువమంత్రి కి షాక్ ఇచ్చిన ఈటల.. అభిమానులతో సెల్ఫీ సందడి చేసిన ఈటల

యువమంత్రి కి షాక్ ఇచ్చిన ఈటల.. అభిమానులతో సెల్ఫీ సందడి చేసిన ఈటల

అంతే కాకుండా రాజకీయాల్లో అతి సామాన్యుడు రాత్రికి రాత్రే గొప్ప నాయకుడిగా మారిపోతాడు, గొప్ప రాజకీయ నాయకుడు ఎందుకూ పరికి రాకుండా దుర్బరంగా మారిపోతుంటాడు. ఇవన్నీ రాజకీయాల్లో సర్వసధారణంగా జరిగిపోయే పరిణామాలు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతున్నాయి. మొన్నటి వరకూ సహచర మంత్రులుగా తెలంగాణ రాష్ర్ట క్యాబినెట్ లో కొనసాగిన ఈటల రాజేందర్ రాజకీయాల్లో కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నారు. ఏకంగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కే ఝలక్ ఇస్తున్నారు. ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో ఓ వివాహానికి హాజరైన హుజురాబాద్ బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు.

 కేటీఆర్ ను పట్టించుకోని ఫాన్స్.. యువ నేతతో సెల్ఫీకి ఆసక్తి చూపని అభిమానులు

కేటీఆర్ ను పట్టించుకోని ఫాన్స్.. యువ నేతతో సెల్ఫీకి ఆసక్తి చూపని అభిమానులు

వివాహ వేదిక మీదకు చేరుకోకముందే అభిమానులు ఈటలను చుట్టి ముట్టి సెల్ఫీలకోసం ఎగబడ్డారు. ప్రేమతో ఫోటో దిగేందుకు ఉత్సాహపడుతున్న అభిమానులను నిరుత్సాహపరచడం ఇష్టం లేని ఈటల వారితో సెల్ఫీలు దిగుతున్న సందర్బం తలెత్తింది. ఇదంతా కళ్యాణ మండపం ప్రధాన ద్వారం వద్దే చోటు చేసుకుంది. ఇక అదే సమయానికి అదే వివాహానికి హాజరైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కళ్యాణ మండపం దగ్గరకు వెళ్లేందుకు లోపలికి వచ్చారు. కాని దారికి అక్కడే ప్రధాన ద్వారానికి సమీపంలో ఈటల రాజేందర్ అభిమానులతో సెల్ఫీలు దిగుతుండడంతో కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు మంత్రి కేటీఆర్. తన గన్ మెన్లు సైడివ్వండంటూ కొంత మందిని పక్కకు జరిపగా, సెల్ఫీలు దిగుతున్న ఈటల రాజేందర్ పక్కనుండి మాస్క్ పెట్టుకుని కేటీఆర్ లోపలకు వెళ్లారు.

 చెంతకు రాని అభిమానులు.. చిన్నగా సైడైపోయిన మంత్రి..

చెంతకు రాని అభిమానులు.. చిన్నగా సైడైపోయిన మంత్రి..

ఆ సమయంలో ఎవ్వరూ కూడా కేటీఆర్ తో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపలేదు. అసలు కేటీఆర్ ను ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఈటలతో పెల్ఫీలు దిగుతున్న వారెవ్వరూ కూడా మంత్రి కేటీఆర్ వైపు కదలలేదు. సాధారణంగా కేటీఆర్ ఎక్కడి కనిపించినా అభిమానులు, తెలంగాణ వాదులు తోచుకుంటూ తెలంగాణ నినాదాలతో హడావిడిచేస్తుంటారు. కానీ ఈటల రాజేందర్ వద్ద పెల్ఫీలు దిగుతున్న వారెవ్వరూ కేటీఆర్ ను పట్టించుకోకపోడం ఆశ్ఛర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో కేటీఆర్ సెల్ఫీలు దిగతున్న ఈటల రాజేందర్ పక్కనుండి గన్ మెన్ల సాయంతో ముందుకు వెళ్లే వీడియో వైరల్ గా మారింది.

English summary
Minister KTR felt a bit embarrassed as Rajender, who was taking selfies, fans near the main entrance. KTR went inside the wearing a mask.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X