కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం మీసేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారా?
రేషన్ కార్డులు లేని నిరుపేద కుటుంబాలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అంతలోనే షాక్ ఇచ్చింది. ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ఎంతో ఆశతో మీ సేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలకు ఊహించని ఝలక్ ఇచ్చింది.
మీ సేవా కేంద్రాలకు వెళ్ళిన వారికి నిరాశ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 2021 ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ లాగిన్ ప్రక్రియ నిలిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు ఆన్లైన్ ఎఫ్ ఎస్ సి లాగిన్ పునరుద్ధరణకు పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మీ సేవ కేంద్రాలకు పరిగెత్తిన వారికి నిరాశ ఎదురయింది.

పౌర సరఫరాల అధికారుల ఆదేశాలు
నేటి నుండి మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ఐటి 2/2196/2025 ద్వారా ప్రకటించింది. దీంతో కొత్త రేషన్ కార్డులు కావలసినవారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధపడుతున్న తరుణంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు కొత్త రేషన్ కార్డులు మీసేవ కేంద్రాల ద్వారా తీసుకోవడం లేదని కిందిస్థాయి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ నిలిచిపోయింది.
మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులపై కీలక సూచన
ప్రజా పాలన, ప్రజావాణి అప్లికేషన్ల డేటా ఎంట్రీ పైన వివరణాత్మక సూచనలు త్వరలో జారీ చేస్తామని అందరూ డీఎస్వోలు ఈ ఆదేశాలను కిందిస్థాయి సిబ్బందికి తెలియజేయాలని మెసేజ్ లు పంపించారు ఈ క్రమంలోనే మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళినవారు వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనువు తిరుగుతున్నారు అయితే ఈ ప్రక్రియ మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ జాప్యమేనా?
ఇదిలా ఉంటే జనవరి 26న తెలంగాణా ప్రభుత్వం కొత్త కార్డుల జారీ ప్రారంభించింది. ఇప్పటికే పలు గ్రామాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి, మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవటం కోసం వెళ్ళిన వారికి ఇస్తున్న షాక్ తో ప్రజలు ఖంగు తింటున్నారు.












Click it and Unblock the Notifications