నాగర్‌కర్నూల్ జిల్లాలో హాస్టల్ సిబ్బంది నిర్వాకం.. అన్నదానం వద్దకు వెళ్లి తినాలని హుకుం
అది ఒక ఎస్టీ బాలుర వసతి గృహం. సాధారణంగా హాస్టల్స్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఘన కార్యానికి ఒడిగట్టారు హాస్టల్ సిబ్బంది. దాదాపు 380 మంది విద్యార్దులు ఉన్న ఆ హాస్టల్ లో శివరాత్రి సందర్భంగా 180 మంది తమ స్వగ్రామాలకు వెళ్ళగా.. 200 మంది మాత్రమే హాస్టల్ లో ఉన్నారు. అయితే ఆ 200 మందికి అన్నం వండకుండా శివరాత్రి సందర్భంగా గుడి దగ్గరకు వెళ్లి అన్నదానం వద్ద తినాలని సూచించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగులలో చోటు చేసుకుంది.
హాస్టల్ లో ఉన్న 200 మంది విద్యార్దులకు బుధవారం నాడు ఉదయం అల్పాహారంగా అన్నం, చారు వడ్డించారు. అంతా వరకు బాగానే ఉన్న మధ్యాహ్నం, రాత్రి భోజనం కోసం దేవాలయం వద్దకు వెళ్లి అన్నదానం వద్ద తినాలని హుకుం జారీ చేశారు. హాస్టల్ కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిబండ శివాలయంలో మధ్యాహ్నం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి వెళ్లాలని.. రాత్రికి వీరంరాజుపల్లి రోడ్డులోని గంగమ్మ దేవాలయం వద్ద పెట్టే భోజనం తినాలని విద్యార్థులకు చెప్పి వంట చేయడం మానేశారు.

అయితే విధిలేక ఆలయాల వద్దకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవమే ఎదురైంది. భక్తులు తిన్నాకే తినాలని ఆలయ నిర్వాహకులు చెప్పడంతో విద్యార్ధులకు షాక్ తగిలింది. భక్తులు తినే వరకు ఆగి కొందరు పెట్టింది తినగా... సగం మందికి పైగా విద్యార్థులు తినకుండా మిగిలిపోయినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం పాఠశాలలో విద్యార్థులు నీరసంగా కనిపించడంతో ఉపాధ్యాయులు ఆరా తీయడంతో విషయం బయటపడింది.
200 మంది విద్యార్ధులు హాస్టల్ లో ఉన్నప్పుడు భోజనం వండకుండా.. అన్నదానం వద్ద తినమని పంపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనం కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి విద్యార్థులను నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడమేంటని ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications