తెలంగాణ హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఏం జరిగింది అంటే ?

పుట్టిన ప్రతి జీవికీ తప్పనిది అంటే మరణం అనే చెప్పాలి. చావు అనేది ఎవరికి ఎప్పుడూ ఎలా వస్తుందో చెప్పలేం. ఆ సమయం వచ్చింది అంటే దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పటికీ ఊహించని రీతిలో పలువురు మృత్యువాత పడ్డ ఘటనను చూస్తుంటాం. ఇప్పుడు ఈ తరహా ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉన్న హైకోర్టులో చోటు చేసుకుంది. కోర్టు హాలులో వాదనలు వినిపిస్తూనే న్యాయవాది కుప్పకూలిన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది వేణుగోపాలరావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే తోటి న్యాయవాదులు ఆయనను అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వేణుగోపాలరావు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే న్యాయవాది మృతికి సంతాపంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా కోర్టుల్లోనూ అత్యవసర పిటిషన్లు, పాస్‌ ఓవర్‌ పిటిషన్లను విచారించి.. రెగ్యులర్‌ పిటిషన్లను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

Shocking incident in Telangana High Court What happened
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+