వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ ఘటన: ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన పేషెంట్ ; ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఇద్దరూ గుండెపోటుతో మృతి

|
Google Oneindia TeluguNews

కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకూ ఎన్నడూ జరగని షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. హార్ట్ స్ట్రోక్ తో ఒక పేషెంట్ డాక్టర్ వద్దకు వెళ్లగా, ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కూడా హార్ట్ స్ట్రోక్ రావడం తో అటు పేషెంట్, ఇటు డాక్టర్ ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే సారి ఇద్దరి మృతితో విషాదం చోటు చేసుకుంది.

గుండెపోటు వచ్చిన పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తూ వైద్యుడు మృతి

గుండెపోటు వచ్చిన పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తూ వైద్యుడు మృతి

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన జగ్యా నాయక్ అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. జగ్యా నాయక్ ట్రీట్మెంట్ కోసం గాంధారి లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కు తరలించగా అతనికి డాక్టర్ లక్ష్మణ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తున్న క్రమంలో ఊహించని విధంగా డాక్టర్ లక్ష్మణ్ కు గుండెపోటు రావడంతో, పేషెంట్ ని చూస్తూనే డాక్టర్ కిందపడిపోయారు. సహజంగా రోగి ప్రాణాలు కాపాడటానికి ఎంతగానో ప్రయత్నం చేసే డాక్టర్ వైద్యం చేస్తున్న క్రమంలో కుప్ప కూలిపోవటంతో డాక్టర్ ను కాపాడటానికి ఆస్పత్రి సిబ్బంది ఎంతగానో ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోయింది. డాక్టర్ లక్ష్మణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కూడా మృతి

హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కూడా మృతి

పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తూ డాక్టర్ మృతిచెందడంతో షాక్ కు గురైన పేషెంట్ బంధువులు దిక్కుతోచని స్థితిలో అక్కడి నుండి పేషెంట్ ను కామారెడ్డికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో పేషెంట్ జగ్యా నాయక్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. హృద్రోగ వైద్య నిపుణుడు అయిన డాక్టర్ లక్ష్మణ్, హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం, అది కూడా హార్ట్ స్ట్రోక్ తో ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఒక పేషెంట్ ని చూస్తున్న క్రమంలో చనిపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

డాక్టర్ లక్ష్మణ్ మహబూబాబాద్ జిల్లా వ్యక్తి

డాక్టర్ లక్ష్మణ్ మహబూబాబాద్ జిల్లా వ్యక్తి


డాక్టర్ లక్ష్మణ్ నిజామాబాదు జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన గాంధారి మండల కేంద్రంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కూడా నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ కు చెందిన డాక్టర్ లక్ష్మణ్ వైద్యం చేస్తూ మృతిచెందడంతో, అతని మృతదేహాన్ని స్వస్థలమైన మహబూబాబాద్ కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం టేకుల పల్లి తండాకు చెందిన లక్ష్మణ్ ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎంఎస్ సర్జన్ పూర్తి చేశారు. మృతుడికి భార్య స్నేహలత, ఇద్దరు కుమార్తెలు శ్రీజ, దక్షిణి ఉన్నారు. అయితే వైద్యుడు డాక్టర్ లక్ష్మణ్ కు ఇదివరకే గుండెకు స్టంట్ వేసినట్లుగా చెప్తున్నారు.

ఒకేసారి రెండు విషాదకర ఘటనలు

హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ జగ్యా నాయక్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఇద్దరికి పెళ్లిళ్లు కాగా మరో కుమారుడు హైదరాబాదులో విద్యనభ్యసిస్తున్నారు. ఇక జగ్యా నాయక్ కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకేసారి జరిగిన రెండు విషాదకర మరణాలు బాధితుల కుటుంబాలను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఇటీవల కాలంలో గుండె జబ్బుల కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వుంది. లేకుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి.

English summary
The shocking incident took place in Kamareddy. The patient who went for treatment; The doctor who was doing the treatment, both of them died of heart attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X