వరంగల్ కలెక్టర్ ప్రశ్నలకు తెల్లముఖం వేసిన విద్యార్థులు.. అసలేం జరిగిందంటే
విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు విద్యార్థులకు సరిగా పాఠాలు చెబితే ఆ విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపైన అవగాహన వస్తుంది. తిరిగి దానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు అడిగితే ఒకరు కాకపోతే ఒకరైనా సమాధానం చెబుతారు. కానీ మన విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో కొన్ని చోట్ల టీచర్లు, అధ్యాపకుల పనితీరు ప్రతి ఒక్కరికి విస్మయాన్ని కలిగిస్తుంది.
విద్యార్థులు ఎలా చదువుతున్నారో ప్రశ్నలు అడిగిన కలెక్టర్
తాజాగా వరంగల్ జిల్లాలో గిరిజన బాలుర గురుకుల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ విద్యార్థుల సామర్థ్యాన్ని చూసి షాక్ కు గురయ్యారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే వరంగల్ జిల్లా నర్సంపేటలోని గిరిజన బాలుర గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద సందర్శించారు. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో తెలుసుకోవాలని భావించిన కలెక్టర్ 9వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు.

టీచర్ లపై కలెక్టర్ ఆగ్రహం
తెలుగులో సమాసాలు ఎన్ని? మీకు వేమన పద్యాలు వచ్చా? అసలు వేమన పద్యాలు అంటే తెలుసా? ఇలా ఏ ప్రశ్న అడిగినా విద్యార్థుల నుండి ఒక్క సమాధానం కూడా రాలేదు. ప్రతి ప్రశ్నకు విద్యార్థులు సైలెంట్ గా ఉండడం చూసిన కలెక్టర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. కనీసం తెలుగు గురించి వారికి అవగాహన లేకపోవడంతో కలెక్టర్ ఉపాధ్యాయులను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీచర్ లకు కలెక్టర్ హితవు
విద్యార్థులకు ఏం పాఠాలు చెబుతున్నారు అంటూ ప్రశ్నించారు. విద్యార్థులకు మంచి విద్యా బోధన చేయాలని టీచర్లకు హితవు పలికారు. వెంటనే టీచర్లతో వేమన పద్యాలు చదివించి వాటికి అర్థాలు వివరించమని ఆదేశించారు. తెలుగు భాషకు సంబంధించిన కనీస అవగాహన విద్యార్థులకు లేకపోవడం పైన ఆమె ఉపాధ్యాయులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పదోతరగతి విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులపై దాడి ఘటనతో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
ఇటీవల ఈ గురుకులంలో ఇంటర్ విద్యార్థులు పదోతరగతి విద్యార్థులపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో కలెక్టర్ ఈ కళాశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. కనీసం ప్రాథమిక జ్ఞానం కూడా విద్యార్థులకు లేకపోవడం పైన టీచర్ల పనితీరు మార్చుకోవాలని కలెక్టర్ హితువు పలికారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications